తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాకు కరోనా సోకలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా: ప్రభు - prabhas prabhu

తనకు కరోనా సోకిందనే వార్తలపై సీనియర్ నటుడు ప్రభు స్పష్టతనిచ్చారు. ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.

Actor Prabhu clarifies about COVID 19 rumours
నాకు కరోనా సోకలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా: ప్రభు

By

Published : Oct 3, 2020, 1:07 PM IST

సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నట్టుండి కనిపించకపోతే.. వాళ్లు కొవిడ్‌-19 బారిన పడ్డారని.. అందుకే బయటకు రావడం లేదని ఇటీవల సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను కరోనా బారినపడ్డానంటూ ఇటీవల నెట్టింట్లో వచ్చిన వార్తలపై ప్రముఖ నటుడు ప్రభు స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు.

తన తండ్రి నటుడు శివాజీ గణేషన్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం (అక్టోబర్ ‌1) ఓ స్మారక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలువురు రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యారు. నటుడు ప్రభు మాత్రం కనిపించలేదు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారని, క్వారంటైన్‌లో ఉన్నారని.. అందుకే స్మారక కార్యక్రమంలో కనిపించలేదంటూ పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ వార్తలపై ఆయన తాజాగా స్పందించారు.

'నేను కొవిడ్‌ బారినపడలేదు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇటీవల నా కాలు బెణికింది. అందువల్లే నేను స్మారక కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను. ఇప్పుడు ఆర్యోగంగా ఉన్నాను' అని ప్రభు పేర్కొన్నారు.

ప్రభాస్‌ 'డార్లింగ్‌' సినిమాలో ప్రభు నటించారు. ఇందులో ప్రభాస్‌ తండ్రిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. 'ఆరెంజ్‌', 'శక్తి', 'బెజవాడ', 'ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాల్లో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్‌ సెల్వన్‌'లో ఆయన నటించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details