తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2020, 7:58 PM IST

ETV Bharat / sitara

హీరో నితిన్ దాతృత్వం.. రూ.20 లక్షలు విరాళం

హీరో నితిన్, కరోనాపై పోరాటానికి తన వంతు సాయం చేశాడు. తెలుగు రాష్ట్రాల సహాయనిధికి చెరో రూ.10 లక్షలు విరాళమిచ్చాడు.

హీరో నితిన్ దాతృత్వం.. రూ.20 లక్షలు విరాళం
హీరో నితిన్

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు అన్నిరాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్​ను కేటాయించాయి. ఇలాంటి సమయంలో హీరో నితిన్ మంచి మనసు చాటుకున్నాడు. తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.10 లక్షలు అందజేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు.

"కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్స్​​కు చెరో రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మనందరం కలిసి పోరాడాలి. ఇంట్లోనే భద్రంగా ఉండండి" -హీరో నితిన్ ట్వీట్

హీరో నితిన్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details