కరోనా వైరస్ కారణంగా తన భార్య, పిల్లలు విదేశాల్లోనే ఉండిపోయారని యువ కథానాయకుడు మంచు విష్ణు తెలిపాడు. ఫిబ్రవరి చివరి వారంలో తమ బంధువుల్లో ఒకరికి సర్జరీ ఉండటం వల్ల భార్యాపిల్లలతో కలిసి అమెరికా వెళ్లానని చెప్పాడు. అయితే తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల కోసం తాను ముందుగానే అమెరికా నుంచి వచ్చానన్నాడు. తన భార్య విరోనిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరా వద్దామనుకున్న సమయంలో మన దేశంలో పరిస్థితి విషమించి విమానాలు ఆపేయడం వల్ల వాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని వివరించాడు.
'కుటుంబాన్ని మిస్సవుతున్నా.. అదే నాకు బ్యాడ్ హాబిట్' - మంచు విష్ణు
లాక్డౌన్ కారణంగా విదేశాల్లో ఉన్న తన భార్య, పిల్లలను చాలా మిస్ అవుతున్నానని యువ కథానాయకుడు మంచు విష్ణు తెలిపాడు. తనలాగే చాలా మంది బాధపడుతున్నారని.. ఏది ఏమైనా లాక్డౌన్ నియమాలను పౌరులంతా గౌరవించాలని అతడు కోరాడు.
గత నెలలో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యానని చెప్పాడు విష్ణు. తనకున్న బ్యాడ్ హ్యాబిట్ భార్యాపిల్లలతో తాను బాగా కనెక్ట్ అయి ఉంటానని, అందుకే వారిని చాలా మిస్సవుతున్నానని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వారు లేకుండా చాలా కష్టంగా ఉందని, తనలాగే చాలా మంది ఈ బాధ అనుభవిస్తూ ఉండొచ్చని తెలిపాడు. కానీ కరోనాపై పోరాటంలో భాాగంగా నిర్వహిస్తోన్న లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని అతడు కోరాడు.
ఇదీ చూడండి.. కరోనాపై పాట రూపొందించిన కీరవాణి.. నెట్టింట వైరల్