కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆచార్య' విడుదల తేదీ వాయిదా పడింది. మొదటగా ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కానీ.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. పరిస్థితులు చక్కబడ్డాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
చిరంజీవి 'ఆచార్య' విడుదల వాయిదా - acharya release date
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆచార్య'. రామ్చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా వేసినట్లు ప్రకటించింది చిత్రబృందం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పింది.
ఆచార్య
మెగాస్టార్ పుట్టినరోజు ఆగస్టు 22కు మూడు రోజుల ముందు ఆగస్టు 19న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేయనున్నట్లు సినీవర్గాల టాక్. రామ్చరణ్ ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఇంకా.. కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తుండగా, సోనూసూద్ విలన్గా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.