అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్(ఏఎమ్పీఎస్) అధ్యక్షులు జాన్ బెయిలీ భారత్లో పర్యటిస్తున్నారు. ముంబయిలో మాట్లాడిన ఆయన ఏపీఎంపీఎస్ హాలీవుడ్కే పరిమితం కాదని, అకాడమీని విశ్వవ్యాప్తం చేస్తున్నామని అన్నారు.
'అకాడమీ హాలీవుడ్కే పరిమితం కాదు'
అకాడమీ హాలీవుడ్కే పరిమితం కాదని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్ అధ్యక్షులు జాన్ బెయిలీ తెలిపారు. భారత్లో పర్యటిస్తున్న ఆయన.. భారత సినీ పరిశ్రమ ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు రూపొందిస్తోందని చెప్పారు.
"అకాడమీలో వివిధ దేశాల సంస్కృతులు పాలుపంచుకోడాన్ని ఆహ్వానిస్తున్నాం. గత ఏడాది 56 దేశాల నుంచి 928మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. అకాడమీ హాలీవుడ్కే పరిమితం కాదు" - జాన్ బెయిలీ, ఏఎమ్పీఎస్ అధ్యక్షుడు
ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు భారత్ నుంచి వస్తున్నాయని, ఇక్కడ దర్శకులు ఏడాదికి 1800 పైచిలుకు చిత్రాలు రూపొందిస్తున్నారని జాన్ బెయిలీ తెలిపారు. అమెరికా నుంచి వచ్చే చిత్రాల కంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికమని చెప్పారు.