తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రభాస్-ఆమిర్​తో పాన్ ఇండియా సినిమా చేయాలి' - swaroop r

డార్లింగ్ ప్రభాస్-ఆమిర్ ఖాన్​లతో తనకు పాన్ ఇండియా చిత్రం చేయాలని ఉందని చెప్పాడు టాలీవుడ్​ యువ దర్శకుడు స్వరూప్.ఆర్​. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వీటితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.

ఆమిర్-ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో
ఆమిర్ ఖాన్- ప్రభాస్

By

Published : May 2, 2020, 6:15 AM IST

ఇద్దరు నాయకుల్ని ఒకే చిత్రంలో చూడటం ప్రేక్షకులకు పండగ. అలా అని కథేం లేకుండా హీరోలతో నడిపించేద్దాం అనుకుంటే దర్శకులు పప్పులో కాలేసినట్టే! అందుకే పరిమితంగా వస్తుంటాయి మల్టీస్టారర్‌లు. అయితే తనకు రెండు మల్టీస్టారర్‌లు తీయాలని ఉందన్నాడు దర్శకుడు స్వరూప్ ఆర్‌.

'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. తన కలల ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చాడు.

దర్శకుడు స్వరూప్

"మల్టీస్టారర్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అల్లు అర్జున్‌-జూ.ఎన్టీఆర్‌లతో ఇలాంటిదే తెరకెక్కించాలని అనుకుంటున్నా. ప్రభాస్‌-ఆమిర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమా తీయాలనే ఆలోచన ఉంది" -స్వరూప్ ఆర్​, దర్శకుడు

మరి ఆ అవకాశం స్వరూప్‌ ఎప్పుడు అందుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ప్రస్తుతం 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' సీక్వెల్‌ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడీ డైరెక్టర్.

ABOUT THE AUTHOR

...view details