బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ ఖాన్ చేసిన ఓ వర్కౌట్‌కు ఆయన కుమార్తె ఐరా ఖాన్ ఫిదా అయ్యింది. గతంలో 'ధూమ్ 3' సినిమా షూటింగ్ సమయంలో ఆమిర్ చేస్తున్న 'సస్పెండ్ ఆల్టర్నేటివ్ డంబెల్ ప్రెస్' వర్కౌట్ వీడియో సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఐరా ఖాన్ స్పందిస్తూ.. "ఇదేమి ఎక్సర్సైజ్?" అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్రైనర్ స్పందించాడు.
"ఈ ఎక్సర్సైజ్ ఛాతితో పాటు కోర్ కండరాలకు చాలా మంచిది. దీంతో పాటు ఛాతి పనితనంపై మంచి ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా 'ధూమ్ 3' సినిమాలో ఆమిర్ పాత్ర చేసే విన్యాసాలకు ఈ కసరత్తు ప్రతిరోజూ చేయాల్సిఉంది. అయితే ఈ కసరత్తు వల్ల వీపు భాగంలో ముందుకు వంగినట్లు మార్పు కనిపిస్తుంది. వెన్నెముక ఇలా వంగడం వల్ల బహుశా చూడటానికి అందంగా కనిపించకపోవచ్చు. ఇది కచ్చితంగా మరింత నొప్పిని కలిగిస్తుంది" అని వీడియో పోస్ట్ చేసిన ట్రైనర్ వెల్లడించాడు.