బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన కొత్త చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఇటీవలే టర్కీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడి సతీమణి ఎమిన్ ఎర్డోగాన్‌ను వారి అధికార నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. భారత్‌లో తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలపై చర్చించేందుకే ఆమెతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఫొటోలు ఎమినో పోస్ట్ చేశారు. ఆమిర్‌తో మాట్లాడటం తనకెంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
"ప్రపంచ గుర్తింపు పొందిన నటుడు, నిర్మాత, దర్శకుడు ఆమిర్‌ఖాన్‌తో భేటీ కావడం చాలా ఆనందంగా ఉంది. తన కొత్త చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్‌ను టర్కీలోని వివిధ ప్రాంతాల్లో తీయాలనుకుంటున్నారు. ఇది చాలా సంతోషాన్నిచ్చింది. ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"