తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లి పీటలెక్కనున్న ఆది పినిశెట్టి.. ఆ నటితోనే.. - ఆది పినిశెట్టి చిత్రాలు

Aadhi Pinisetty Marriage: నటుడు ఆది పినిశెట్టి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడబోతున్నారు. ఈ మేరకు ఆయనే సోషల్​మీడియా ద్వారా తెలిపారు.

aadi pinisetty
aadi marriage

By

Published : Mar 26, 2022, 6:19 PM IST

Aadhi Pinisetty Marriage: 'గుండెల్లో గోదారి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన 'సరైనోడు', 'నిన్ను కోరి', 'రంగస్థలం', 'నీవెవరో'’,' యూ టర్న్‌', 'గుడ్‌ లక్‌ సఖి' వంటి చిత్రాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్​మీడియా ద్వారా తెలిపారు. 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను పోస్ట్​ చేశారు.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ
"మేమిద్దరం ఒకరి జీవితంలోకి మరొకరు రావడం చాలా గొప్ప విషయం. చాలా కాలం నుంచి మేం కలిసే ఉన్నాం. ఇప్పుడు అధికారికంగా తెలియజేస్తున్నాం. 24వ తేదీ మాకు ఎంతో ప్రత్యేకం. మా కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకు అవసరం." అని ఆది పినిశెట్టి అన్నారు.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ

2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కాక్కా’ (Yagavarayinum Naa Kaakka) కోసం మొదటిసారి ఆది- నిక్కీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్‌లో ఉన్నారని.. గతంలో వార్తలు వచ్చాయి.

ఇదీ చదవండి: 'మిషన్​ ఇంపాజిబుల్​ 7' రిలీజ్​పై వివాదం.. చివరి చిత్రం అదేనా?

ABOUT THE AUTHOR

...view details