తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2019, 8:46 AM IST

ETV Bharat / sitara

నటుడు రాజశేఖర్‌కు తప్పిన ప్రమాదం

టాలీవుడ్ నటుడు రాజశేఖర్​ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమయానికి కారు ఎయిర్​ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

నటుడు రాజశేఖర్‌కు తప్పిన ప్రమాదం

సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. శంషాబాద్ పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్‌పై ఆయన వాహనం బోల్తా కొట్టింది. అనంతరం మూడు ప‌ల్టీలు కొట్టిన‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవ‌డం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ‌కు వెళుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంటున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారు

2017లో 'గరుడవేగ' చిత్ర విడుదలకు ముందు రాజశేఖర్​ ఇదే విధంగా ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్​లోని పీవీ ఎక్స్​ప్రెస్​ హైవేపై మరో వ్యక్తి కారును తన వాహనంతో ఢీకొట్టారు.

ABOUT THE AUTHOR

...view details