బప్పీలహరి.. సంగీత దర్శకుడిగా ఎంత పాపులరో, ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి గోల్డ్మ్యాన్గానూ అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సంగీత దిగ్గజాన్ని ఆదర్శంగా తీసుకున్న ఓ వ్యక్తి 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు ధరించిన బంగారు నగల విలువ రూ.కోటిన్నరపైనే.
పుణెకు చెందిన ప్రశాంత్ సప్కాల్కు బప్పీలహరి అంటే ఎనలేని అభిమానం. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఒళ్లంతా పసిడితో మెరిసిపోతున్నాడు. బంగారు ఆభరణాలే కాకుండా ఫోన్, చేతి గడియారం చివరకు కాళ్లకు వేసుకునే జోళ్లు కూడా కనకంతో తయారు చేసినవే వాడుతున్నాడు. బప్పీలహరిలా జీవించడం తన కోరిక అంటున్నాడు.
"గత రెండేళ్ల నుంచి ఈ బంగారు ఆభరణాలు ధరిస్తున్నాను. వీటి ధర కోటిన్నర. నాకు ఆదర్శం బప్పీలహరినే. ఆయన వేషధారణతో అందరిలో ప్రాచుర్యం పొందాడు. ఇప్పుడు నేను ఆయన కంటే ఎక్కువగా పాపులర్ అయ్యాను"
-ప్రశాంత్ సప్కాల్, పుణె వ్యాపారవేత్త