67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దక్షిణాది సినిమాలు సత్తా చాటాయి. కేంద్ర సమాచార ప్రసార శాఖ అధ్వర్యంలోని డైరక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమా మూడు, నాని నటించిన 'జెర్సీ' రెండు అవార్డులను సొంతం చేసుకున్నాయి. మోహన్ లాల్ నటించిన మలయాళీ చిత్రం 'మరక్కర్ ద లయన్ ఆఫ్ అరేబియన్ సీ' అవార్డును అందుకుంది. ఇంకా ఎవరెవరిని, ఏఏ చిత్రాలను అవార్డులు వరించాయో కింది జాబితాలో చూడండి.
జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీరే
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్‌బాబు 'మహర్షి' అవార్డులు దక్కాయి. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్ సింగ్ 'చిచ్చోరె' నిలిచింది. ఉత్తమ నటుడిగా ధనుష్, ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డు వరించింది. ఇంకా ఏఏ చిత్రాలను, ఎవరెవరికి అవార్డులు దక్కాయో తెలుసుకుందాం.
జాతీయ చలన చిత్ర అవార్డులు
నాన్ ఫీచర్ విభాగంలో ఉత్తమ చిత్రంగా యాన్ ఇంజనీర్‌డ్ డ్రీమ్ నిలిచింది. నాన్ ఫీచర్ విభాగంలో ఉత్తమ వాయిస్ ఓవర్‌గా వైల్డ్ కర్ణాటక సినిమాకుగానూ సర్ డేవిడ్ అటెన్‌బరగ్ అవార్డు పొందారు. ఉత్తమ ఎడిటర్‌గా అర్జున్ సరయా నిలిచారు. సినిమాలకు అత్యంత అనువైన రాష్ట్రంగా సిక్కిం నిలిస్తే ఉత్తమ సినీ విమర్శకులుగా సోహినీ ఛటోపాధ్యాయ అవార్డు దక్కించుకున్నారు. గతేడాది మేలోనే ఈ అవార్డులను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
Last Updated : Mar 22, 2021, 8:10 PM IST