తెలంగాణ

telangana

ETV Bharat / sitara

50వ ఎడిషన్​లో 50 ఏళ్ల నాటి సినిమాలు - IFFI 2019

వచ్చే నెలలో భారత్​లో 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరగనుంది. పలు భాషలకు చెందిన 50 ఏళ్ల క్రితం నాటి 12 సినిమాలను ప్రదర్శించనున్నారు.

50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

By

Published : Oct 6, 2019, 11:44 AM IST

గోవా వేదికగా 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వచ్చే నెల 20 నుంచి 28 వరకు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన సుమారు 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత్​తో పాటు రష్యా సంయుక్తంగా నిర్వహించనుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.

కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్

26 ఫీచర్​, 15 నాన్-ఫీచర్ సినిమాలతో పాటు పలు ప్రాంతీయ భాష చిత్రాలను ప్రదర్శించనున్నారని ప్రకాశ్ జావడేకర్ అన్నారు. వీటితే పాటు వివిధ భాషల్లో 50 ఏళ్ల క్రితం తెరకెక్కిన 12 సినిమాలను ఈ కార్యక్రమంలో వీక్షకులకు చూపించనున్నారు.

ఇటీవలే దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్​ బచ్చన్ నటించిన 7-8 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రోత్సవానికి పలువురు ప్రముఖ నటీనటులతో పాటు 10 వేల మందికిపైగా సినీ ప్రేమికులు హాజరు కానున్నారు.

50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details