సాయిపల్లవి..దక్షిణాదిలో విభిన్న సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న హీరోయిన్. 2015లో మలయాళ సినిమా 'ప్రేమమ్'తో వెండితెరకు అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి కుర్రకారు మనసు దోచుకుంటోంది. ఆమె నటించిన కొన్ని పాటలు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొట్టాయి. మరికొన్ని అదే పనిలో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
'మలర్' ఓ సంచలనం..
ఆమె నటించిన తొలి సినిమా 'ప్రేమమ్'. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. అందులో 'మలరే....' అంటూ సాగే గీతంతో సాయిపల్లవి ఒక్కసారిగా పాపులరైంది. టీచర్ పాత్రలో అదరగొట్టేసింది. నవీన్ పోలీ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.
'మెల్లగా వచ్చింది...రికార్డు బద్ధలు కొట్టింది'
తెలుగులో 'ఫిదా' సినిమాతో సాయిపల్లవి మరోసారి ఆకట్టుకుంది. నటనతో పాటు చిత్రంలోని 'వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే...' అనే గీతంతో యూట్యూబ్ రికార్డులను బద్ధలు కొట్టింది. దక్షిణాదిలో అత్యధికులు చూసిన పాటగా రికార్డు సాధించింది. దీన్ని బ్రేక్ చేసింది మళ్లీ సాయిపల్లవి పాటే కావడం విశేషం.
సంచలనం సృష్టించిన 'రౌడీ బేబి'
ధనుష్‌తో కలిసి మారి-2లో నటించింది. ఇందులోని 'రౌడీ బేబి' పాటతో కుర్రకారును కుదురుగా కూర్చోనివ్వకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. కేవలం 16 రోజుల్లోనే 100 మిలియన్ వీక్షణలు దాటేసింది.
ప్రభుదేవా మాస్టర్‌తో ఓ ఫొటో..