ఇటీవలే 19వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. అందులో ముంబయికి చెందిన సన్నీ పవార్.. 'చిప్పా' చిత్రంలో నటనకు గానూ ఉత్తమ బాల నటుడి అవార్డు గెలుచుకున్నాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియా దర్శకుడు గార్త్ డేవిస్ తెరకెక్కించిన 'లయన్' సినిమాలోనూ నటించి ఆకట్టుకున్నాడీ బాలుడు.
'రజనీకాంత్‌లా నేనూ పెద్ద హీరో అవుతా...'
న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్-2019లో ఉత్తమ బాల నటుడిగా నిలిచాడు ముంబయికి చెందిన సన్నీ పవార్. రజనీకాంత్‌లా పెద్ద హీరో అవుతా అంటూ మనసులో మాట బయటపెట్టాడు.
'రజనీకాంత్‌లా పెద్ద హీరోని అవుతా'
"నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదంతా నా తల్లిదండ్రుల కృషితోనే సాధ్యమైంది. నేను రజనీకాంత్‌లా పెద్ద హీరోనై... అమ్మానాన్న గర్వపడేలా చేస్తా. బాలీవుడ్, హాలీవుడ్ రెండింటిలోనూ నటిస్తా" -సన్నీ పవార్, బాల నటుడు
ఈ సినిమా లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఎమ్‌ఏఎమ్‌ఐ 2018తో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
Last Updated : May 16, 2019, 9:38 AM IST