తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తండ్రీకూతుళ్ల మ్యాజిక్ పనిచేయలేదు... - uri

"ఏక్ లడఖి కో దేఖా తో ఐసా లగా" సినిమా బాగుందని విమర్శకులు ప్రశంసించిన... వసూళ్లు అంతంతమాత్రమే..

అనిల్ కపూర్

By

Published : Feb 5, 2019, 2:08 PM IST

బాలీవుడ్​లో గతవారం విడుదలైన కుటుంబ కథా చిత్రం "ఏక్ లడఖి కో దేఖా తో ఐసా లగా". సోనమ్ కపూర్ కథానాయిక. అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో నటించారు. నిజజీవితంలో తండ్రీ కూతుళ్లైన వీరిద్దరూ సినిమాలోనూ అదే పాత్రల్లో కనిపించారు. రాజ్​కుమార్ రావ్, జూహీ చావ్లా ఇతర కీలక పాత్రలు పోషించారు.

సినిమా బాగుందని అందరూ మెచ్చుకున్నా వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. మొదటి వారంలో కేవలం రూ.13.53 కోట్ల వసూళ్లే సాధించింది.

ఈ సినిమా విడుదల రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా రనౌత్ "మణికర్ణిక: ది క్వీన్​ ఆఫ్​ ఝాన్సీ", విక్కీకౌషల్ "ఉరీ''.. చిత్రాలు బాక్సాఫీస్​ వద్ద విజృంభిస్తున్నాయి. అభిమానుల్లో మంచి స్పందనతో రికార్డు వసూళ్ల దిశగా దూసుకెళ్తున్నాయి.


ABOUT THE AUTHOR

...view details