తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​.. 2023లో సరికొత్త ఫీచర్లు ఇవే! - వాట్సాప్ అప్​కమింగ్ ఫీచర్స్ 2023

సరికొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకోవడంలో వాట్సాప్ ఎప్పడూ ముందుంటుంది. ఈ మెసేజింగ్ యాప్ త్వరలో కొన్ని కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి పరిచయం చేయనుంది. ఈ ఫీచర్స్​తో వాట్సాప్ వినియోగం మరింత సులభతరం అవుతుందని సంస్థ చెబుతోంది. మరి వాట్సాప్ తీసుకురాబోతున్న కొత్త ఫీచర్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

whatsapp upcoming features 2023
whatsapp upcoming features 2023

By

Published : Feb 12, 2023, 10:40 PM IST

మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​. 2023లో డెస్క్​టాప్​ స్క్రీన్​లాక్, వ్యూ వన్స్ టెక్స్ట్​, ఐఫోన్​ వినియోగదారులకు PiP వీడియో కాల్స్​ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే బీటా యూజర్లకు పరీక్షిస్తుండగా.. త్వరలోనే అందరికి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. అవేంటో ఓసారి చూద్దాం.

తేదీల వారీగా మెసేజ్​ చూసేయచ్చు
ఇప్పటివరకు పాత మెసేజ్​లు చూడాలంటే.. ఆ తేదీ గుర్తున్నా సరే.. అన్నీ స్క్రోల్​ చేస్తూనే వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు నేరుగా మనకు కావాల్సిన తేదీలోని మెసేజ్​ను చూసే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఐఫోన్​ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

  • చాట్​ విండోలోకి వెళ్లి కావాల్సిన ప్రొఫైల్​ను ఎంపిక చేసుకోవాలి
  • పైన ఉన్న సెర్చ్​ బాక్స్​పై క్లిక్ చేయాలి
  • ఆ తర్వాత కింద ఉన్న క్యాలెండర్​ ఐకాన్​పై క్లిక్​ చేసి కావాల్సిన తేదీని ఎంపిక చేసుకోవాలి.

డెడికేటెడ్​ వీడియో మోడ్​
ఫోటోలు, వీడియోలు మరింత సులభంగా తీసుకునేలా కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​. ఇందుకోసం ప్రత్యేకంగా వీడియో ఆప్షన్​ను తీసుకురానుంది. అంతకుముందు షటర్​ బటన్​ను లాంగ్​ ప్రెస్​ చేస్తే వీడియో రికార్డ్ అయ్యేది. ప్రస్తుతానికి ఇది కొన్ని ఆండ్రాయిడ్​ వెర్షన్లలోనే అందుబాటులో ఉంది.

స్టేటస్​ ప్రొఫైల్​ రింగ్స్​
స్టేటస్​ బార్​లోకి వెళ్లకుండా చాట్​ స్క్రీన్ నుంచే కాంటాక్ట్స్​లో ఉన్న వారి స్టేటస్​ను చూసే ఆప్షన్​ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​. మన కాంటాక్ట్​లోని వ్యక్తి స్టేటస్​ పెడితే ప్రొఫైల్​ పిక్చర్​పై ఆకుపచ్చ రంగుతో రింగ్ వస్తుంది.

కాంపానియన్​ మోడ్​
ప్రస్తుతం ఒక వాట్సాప్​ అకౌంట్​ను ఒక ఫోన్​లో మాత్రమే వినియోగించుకోగలం. ఈ సమస్యకు చెక్​ పెట్టేలా కొత్తగా కాంపానియన్​ మోడ్​ను తీసుకువస్తుంది వాట్సాప్​. దీని ద్వారా ఒకే నెంబర్​తో అనేక ఫోన్లలో లాగిన్​ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైమరీ ఫోన్​లో లాగౌట్​ కాకుండానే మరో ఫోన్​లో లాగిన్​ కావచ్చు.

పిన్న్​డ్ మెసేజ్​
పిన్నింగ్ మెసేజ్​ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​. దీంతో మనకు అవసరమైన మెసేజ్​ను మొత్తం స్క్రోల్ చేయకుండా టాప్​లోనే పిన్​ చేసుకోవచ్చు.

వాట్సాప్​ బిజినెస్​ డైరెక్టరీ
ఇప్పటికే వాట్సాప్ బిజినెస్​ను అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు తాజాగా బిజినెస్​ డైరెక్టరీని తీసుకురానుంది. మన సమీపంలో ఉన్న రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్స్​, ఆటోమొబైల్​ సర్వీస్​ ఇలా ప్రతీ రంగానికి సంబంధించిన వివరాలను అందించేలా కొత్త ఫీచర్​ను తీసుకురానుంది.

వాట్సాప్​ డెస్క్​టాప్​ మోడ్​ స్క్రీన్​ లాక్
వాట్సాప్ యాప్​ మాదిరిగా డెస్క్​టాప్​నకు కూడా స్కీన్​లాక్ ఆప్షన్​ అందుబాటులోకి రానుంది. బయోమెట్రిక్​ ఆప్షన్​తో కాకుండా పాస్​వర్డ్​ మాత్రమే పెట్టుకునేలా ఉండనుంది.

ఐఫోన్​ యూజర్లకు PiP వీడియో కాల్ మోడ్
ప్రస్తుతం ఆండ్రాయిడ్​ యూజర్లకు అందుబాటులో ఉన్న పిక్చర్ ఇన్​ పిక్చర్ వీడియో కాల్ మోడ్​ను ఐఫోన్​ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీంతో వీడియో కాల్​ను మినిమైజ్ చేసుకుని స్క్రీన్​పై పక్కకు పెట్టుకుని మరో పని చేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details