WhatsApp Dual Account Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇకపైఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. లాగౌట్ కాకుండానే ఈ సదుపాయాన్ని పొందవచ్చని వెల్లడించింది. కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం దాదాపుగా అన్ని రకాల ఫోన్లు రెండు సిమ్‌లతో తయారవుతున్నాయి. వృత్తిపరమైన పనుల కోసం ఒకటి, వ్యక్తిగత పనుల కోసం మరొకటి ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక నంబరుతోనే వాట్సప్ వినియోగించుకునే వీలుండేది. రెండో నంబరును వాడాలంటే మాత్రం మొదటి అకౌంట్ నుంచి లాగౌట్ అయి వినియోగించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే ఈ ఫీచర్‌తో రెండు నంబర్లను ఉపయోగించుకుని రెండు ఖాతాలను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్‌బర్గ్ వెల్లడించారు. త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలు వాడాలంటే.. క్లోన్ యాప్‌లు ఉపయోగించాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. వాట్సాప్ అధికారికంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన అనంతరం.. ఒకే ఫోన్‌లో, ఒకే యాప్‌లో రెండు అకౌంట్లను నిర్వహించుకోవచ్చు.
Top 10 WhatsApp Features : వాట్సాప్ లాంఛ్ చేసిన టాప్ 10 ఫీచర్స్ ఇవే.. మీరు వాడుతున్నారా?
వాట్సాప్ డ్యూయెల్ అకౌంట్ ఫీచర్ వాడాలంటే.. యూజర్స్ ఫోన్‌లో కచ్చితంగా రెండు సిమ్‌లు ఉండాలని వాట్సాప్ తెలిపింది. ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యక్తిగత అవసరాల కోసం ఒక వాట్సాప్‌ను, ప్రొఫెషనల్, బిజినెస్ పనుల కోసం మరో వాట్సాప్‌నువినియోగిస్తున్నారు. అలాంటి వారు ఇప్పటి వరకు రెండు ఫోన్‌లను వాడడమో లేదంటే క్లోన్ యాప్ వినియోగించడమో చేసేవారు. ఈ కొత్త ఫీచర్‌తో ఇకపై ఆ అవసరం ఉండదు. వాట్సాప్ అధికారిక యాప్‌లోనే రెండు ఖాతాలను చక్కగా వినియోగించుకోవచ్చు.
రెండు ఖాతాలను ఎలా క్రియేట్ చేయాలి?
How To Create WhatsApp Multiple Accounts :