How to Use Whatsapp One Time Voice Message Feature : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ను తమ యూజర్స్ కోసం అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే వన్-టైమ్ లిసెన్ వాయిస్ మెసేజ్ ఫీచర్. అంటే ప్రస్తుతం మీరు వ్యూ వన్స్ ఫీచర్‌ను ఉపయోగించి ఫొటోలు, వీడియోలు పంపుతున్నట్టే.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌లను కూడా ఒక్కటేసారి వినేలా ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దారు.
మీరు పంపాలనుకున్న సున్నితమైన సమాచారాన్ని వన్-టైమ్ లిసెన్ వాయిస్ మెసేజ్ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో ఎటువంటి భయం లేకుండా పంపుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ వల్ల.. మీరు పంపే వాయిస్ సందేశాన్ని ఇతరులకు ఫార్వర్డ్ లేదా షేర్ చేయడం, సేవ్ చేసుకోవడం, స్టార్ చేయడం, రికార్డ్ చేయడం కుదరదు. తద్వారా ఈ పైవాటిలో దేని ద్వారా కూడా మీరు భవిష్యత్‌లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడదు.
ఎలా వాడాలి?
- ముందుగా మీ వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయండి.
- మైక్రోఫోన్ లేదా మైక్ సింబల్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- దానిని పైకి స్వైప్ చేయండి. ఇది మీ రికార్డింగ్‌ను లాక్ చేస్తుంది.
- తర్వాత రికార్డ్ బటన్‌ను ప్రెస్ చేసి, చెప్పాలనుకున్న విషయం చెప్పండి.
- మీరు నొక్కిన బటన్ గ్రీన్ కలర్లో మారే వరకు వేచి ఉండండి. ఇది 'వ్యూ వన్స్' మోడ్‌ను సూచిస్తుంది.
- ఇప్పుడు సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి.