VIVO Y33T Phone: వివో (Vivo) కంపెనీ వై సిరీస్‌లో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వై33టీ పేరుతో ఈ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌లో హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా సెన్సర్లు అమర్చినట్లు వివో చెబుతోంది. మరి ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్లతోపాటు, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయనేది చూద్దాం.
VIVO Y33T Specification: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేటుతో 6.58 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉపయోగించారు. వై33టీలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒకటి ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
వివో వై33టీ మోడల్‌ను 8 జీబీ ర్యామ్/128 జీబీ అంతర్గత స్టోరేజ్ వేరియంట్లో తీసుకొచ్చారు. దీని ధర రూ. 18,990. మిడ్ డే డ్రీమ్, మిర్రర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, పేటీఎం, టాటా, బజాజ్ ఫిన్‌సర్వ్ ఆన్‌లైన్ స్టోర్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.