తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2020, 4:31 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ETV Bharat / science-and-technology

వన్​ప్లస్ నార్డ్​ ఫీచర్స్​ లీక్- ధర ఎంతో తెలుసా?

జులై 21న విడుదల కానున్న వన్​ప్లస్ స్మార్ట్​ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. రొమేనియాకు చెందిన వెబ్​సైట్ నార్డ్ వివరాలను ప్రచురించింది. 8జీబీ ర్యామ్/128 జీబీ మెమోరీ వేరియంట్ ధర సుమారు రూ. 40,200 ఉండొచ్చని అంచనా వేసింది.

OnePlus Nord price, specifications leak ahead of launch
వన్​ప్లస్ నార్డ్​ ఫీచర్లు లీక్- ధర ఎంతో తెలుసా?

వన్​ప్లస్ సంస్థ నుంచి కొత్త నార్డ్ స్మార్ట్​ఫోన్ జులై 21న భారత మార్కెట్​లో విడుదల కానుంది. వర్చువల్ కార్యక్రమం నిర్వహించి ఫోన్​ను ఆవిష్కరించనున్నారు. అయితే విడుదలకు ముందే స్మార్ట్​ఫోన్​ ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి. ఈవీఓఎంఏజీ.ఆర్​ఓ అనే రొమేనియా వెబ్​సైట్ ఈ వివరాలను ప్రచురించింది.

వన్​ప్లస్ నార్డ్

ధర..

8జీబీ ర్యామ్/128 జీబీ మెమోరీ వేరియంట్ ధర సుమారు రూ. 40,200గా ఉండనున్నట్లు వెబ్​సైట్ వెల్లడించింది. ఫోన్ ధర 500 డాలర్ల లోపే ఉంటుందని వన్​ప్లస్ ఇదివరకు ప్రకటించగా.. వెబ్​సైట్​లో మాత్రం 536 డాలర్లు(సుమారు)గా పేర్కొంది.

వెనుకవైపు మూడు కెమెరాలు(64 ఎంపీ ప్రైమరీ, 16 ఎంపీ, 2 ఎంపీ) ఉంటాయని వెబ్​సైట్ స్పష్టం చేసింది. అయితే నార్డ్​ ఫోన్​కు వెనకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయని ఇదివరకు పలు కథనాలు వచ్చాయి. నార్డ్​లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్​తో పాటు 8 ఎంపీ వైడ్​ యాంగిల్, 5 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్​ సెన్సార్​ ఉండే అవకాశం ఉందని 'ఆండ్రాయిడ్ సెంట్రల్' వెబ్​సైట్ పేర్కొంది.

రొమేనియన్ వెబ్​సైట్ ప్రకారం నార్డ్ ఫీచర్లు

  • 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో 6.55 అంగుళాల సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్​డ్రాడన్ 765జీ ప్రాసెసర్(ఇదివరకే కంపెనీ ప్రకటించింది)
  • హోల్​ పంచ్ సెల్ఫీ కెమెరా
  • 4,300 ఎంఏహెచ్​ బ్యాటరీ సామర్థ్యం

5జీ సాంకేతికతతో వన్​ప్లస్ నార్డ్ అందుబాటులోకి రానుంది. ప్రకాశవంతమైన నీలం, పుదీనా ఆకుపచ్చ, నలుపు, బూడిద రంగుల్లో ఫోన్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details