సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెర్చ్, అసిస్టెంట్, మ్యాప్స్‌లో.. యూజర్లు తమ దగ్గర్లోని కరోనా పరీక్షా కేంద్రాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), మైగొవ్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది గూగుల్.
ఫీచర్ విశేషాలు..
- ఈ ఫీచర్ ఇంగ్లీష్ సహా.. తెలుగు, హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
- ఎవరైనా గూగుల్‌లో కరోనాకు సంబంధించిన సెర్చ్ చేస్తే.. ఇకపై టెస్టింగ్ ట్యాబ్ కనిపిస్తుంది.
- టెస్టింగ్ ట్యాబ్‌లో వినియోగదారుడికి సమీపంలోని కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ల వివరాలు ఉంటాయి.