Tiktok Interface In Twitter: భారత్ సహా ఇతర దేశాల్లో టిక్‌టాక్ చాలా త్వరగా పుంజుకుంది. ఇందుకు గల కారణాల్లో ప్రధానమైంది.. వీడియోలను త్వరగా చూసేందుకుగానూ ఇచ్చిన స్వైపింగ్ ఆప్షన్. టిక్‌టాక్ మాత్రమే కాకుండా.. ఇన్‌షార్ట్స్ లాంటి యాప్‌లు ఈ స్వైపింగ్ ఆప్షన్‌తో మార్కెట్లోకి చాలా త్వరగా వెళ్లాయి. తరువాత కాలంలో చాలా యాప్‌లు దీనిని ఫాలో అవుతూ వచ్చాయి. ప్రస్తుతం మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫాం అయిన ట్విట్టర్ కూడా ఇదే బాట పట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ట్విట్టర్ ఇండియా ఓ పోస్ట్ లో పేర్కొంది. ఇది ఇంకా పరీక్షల దశలో ఉన్నట్లు చెప్పింది.
ట్విట్టర్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు వీడియోలను, ఫొటోలను, టెక్స్ట్‌తో కూడిన ట్వీట్లను ఒక్కొక్కటిగా పైకి స్వైప్ చేయవచ్చు. ఇందులో యూజర్‌కు అసవసరమయ్యే కంటెంట్‌ను చూపించే దిశగా అడుగు వేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇలా వచ్చే ఫీడ్‌ను చూసే విధంగా ఇంటర్ఫేస్ను సిద్ధం చేస్తోంది. దీనిని భారత్ సహా ఇతర దేశాల్లో కేవలం ఎంపిక చేసిన వినియోగదారుల ఐఓఎస్ ఫోన్లలో ప్రయోగాలు చేస్తోంది. అయితే గతంలో వివాదాస్పదంగా మారిన ట్విట్టర్ ట్రెండ్స్ అప్షన్కు కొత్త ఇంటర్ఫేస్ ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది. ప్రస్తుతం ఆ బటన్ ఎక్స్ప్లోరల్లో మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు దానిని పైకి తీసుకువచ్చిది. మునపటిలానే యూజర్‌ను బ్లాక్ చేయడం, ట్వీట్లను రిపోర్ట్ చేయడం లాంటివి కొత్తగా ఇంటర్ఫేస్లో ఉండనున్నాయి.