మొబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏటా ఎన్నో కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తుంటాయి. వాటిలో కంపెనీలకు లాభాలు తెచ్చిన మోడల్స్ ఉంటాయి, సక్సెస్ కానివీ ఉంటాయి. కానీ, దాదాపు అన్ని కంపెనీలూ తమ మార్కెట్ పరిధిని విస్తరించుకునేందుకు ప్రతి నెలా కొత్త ఫోన్లను విడుదల చేస్తూనే ఉంటాయి. ఈ ఏడాది పూర్తి కావస్తుండటంతో డిసెంబరులో కంపెనీలు విడుదల చేసే మోడల్స్‌పై యూజర్లు కాస్త ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అయితే, ఈసారి మొబైల్ కంపెనీలు విడుదల చేసిన వాటిలో సింగిల్ వేరియంట్ కంటే సిరీస్‌గా వచ్చే మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం, డిసెంబరులో రాబోయే సిరీస్‌లు ఏంటో చూద్దామా..?
వివో ఎక్స్ 90 సిరీస్ (Vivo X90 Series)
వివో కంపెనీ ఎక్స్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను డిసెంబరు చివరి వారంలో విడుదల చేయనుంది. రెండు లేదా మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారట. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌తో పనిచేస్తాయి. 120హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో హెచ్‌డీఆర్10+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2/మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్లను ఉపయోగించినట్లు సమాచారం. వెనుకవైపు 50 ఎంపీ, రెండు 12 ఎంపీ కెమెరాలు, ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ధర ₹ 45 వేల నుంచి ₹ 50 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
వన్‌ప్లస్ 11 సిరీస్ (OnePlus 11 Series)
ఈ ఫోన్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలు ఇస్తున్నారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ వైర్, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందట. 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 12 జీబీ/256 జీబీ, 16 జీబీ/256 జీబీ, 16 జీబీ/512 జీబీ వేరియంట్లలో తీసుకొస్తున్నారని సమాచారం.
ఐకూ 11 సిరీస్ (IQOO 11 Series)
ఐకూ కంపెనీ డిసెంబరు మొదటి వారంలో కొత్త ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ ఫోన్‌ను ఎన్ని వేరియంట్లలో తీసుకొస్తున్నారనేది తెలియాల్సివుంది. ఇందులో 144హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో 6.78 అంగుళాల హెచ్‌డీఆర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఐకూ 11 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారు. 8 జీబీ/128 జీబీ, 12 జీబీ/ 256 జీబీ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌తోపాటు ఐకూ కంపెనీ నియో సిరీస్‌లో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. ఐకూ నియో 7 పేరుతో విడుదల చేయనున్న ఈ ఫోన్‌లో 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కెమెరా, బ్యాటరీ, ర్యామ్, స్టోరేజ్ ఫీచర్ల గురించి తెలియాల్సి వుంది.
షావోమి 13 సిరీస్ (Xiaomi 13 Series)
షావోమి 13 పేరుతో ఈ ఫోన్‌ను ముందుగా చైనాలో విడుదల చేయనుంది. మరి, భారత మార్కెట్లోకి ఏ పేరుతో విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేదు. డిసెంబరు రెండు లేదా నాలుగో వారంలో ఈ ఫోన్‌ను విడుదల చేస్తారని సమాచారం. ఇందులో 6.2 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. 50 ఎంపీ లైకా లెన్స్ ప్రధాన కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలు ఉంటాయని సమాచారం.
మోటో ఎక్స్40 సిరీస్ (Moto X40 Series)
మోటోరోలా డిసెంబరు నెలలో మూడు ఫోన్‌లను విడుదల చేయనుంది. మోటో ఎక్స్40, మోటో ఎడ్జ్ 40 (Moto Edge 40), మోటో ఈ 30 నియో ( Moto E30 Neo). వీటిలో ఎక్స్ 40 ఫ్లాగ్‌షిప్ మోడల్ కాగా, ఎడ్జ్ 40, ఈ30 నియో మిడ్‌రేంజ్ మోడల్స్. మోటో ఎక్స్ 40లో 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో క్వాడ్ కర్వ్‌డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎమ్‌వైయూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది.