కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలుగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో ఆన్‌లైన్ విద్య కీలకంగా మారింది. ఎంతో మంది చిన్నారులు బడికి వెళ్లకుండానే.. ఇళ్లలోనే కూర్చొని తరగతులు వినేస్తున్నారు. విద్యార్థులంతా ఎక్కువగా ఇంటర్నెట్ అప్లికేషన్లను వినియోగిస్తున్నారు. ఇందుకు స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబెట్ల సాయం తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది హ్యాకర్లు స్కూళ్ల సర్వర్లపై హ్యాక్ చేస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ETV Bharat / science-and-technology
జాగ్తే రహో: ఆన్‌లైన్ క్లాస్‌లకు రక్షణ సాధ్యమేనా? - Cyber attack
దేశంలో లాక్‌డౌన్ విధించాక వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ల వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు, ఉద్యోగులు మీటింగ్స్ కోసం వాటినే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు పలు మాల్వేర్ల సాయంతో డేటా చౌర్యం చేస్తున్నారు. అంతేకాదు చిన్నారులపై అంతర్జాలం వేదికగా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
జాగ్తే రహో: ఆన్‌లైన్ క్లాస్‌లకు రక్షణ సాధ్యమేనా?
చిన్నారుల ఆన్‌లైన్ క్లాస్‌ల్లో అశ్లీల చిత్రాలను ప్రదర్శించడం సహా సైబర్ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇటువంటి ఫిర్యాదులతో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్కూళ్ల సర్వర్లను హ్యాక్ చేసిన అందులోని డేటాను డబ్బు కోసం డార్క్ వెబ్‌లో పెడుతున్నారు. మరి ఇలాంటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.
Last Updated : Feb 16, 2021, 7:31 PM IST