అంగారకుడి యాత్రకు మరోసారు సన్నద్ధమవుతోంది నాసా. ఇప్పటివరకు 8సార్లు విజయం సాధించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. తాజాగా ఈ నెల 30న మరో రోవర్‌ను అంగారకుడి వద్దకు పంపనుంది. అంగారకుడిపై ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో ఈ "పెర్సీవరెన్స్" అతిపెద్దదని, అత్యంత మేధస్సు కలిగినదని నాసా పేర్కొంది.
ఈ రోవర్ ల్యాండింగ్ కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది నాసా. ఇతర ప్రాజెక్టులతో పోల్చితే.. అంగారకుడిపై చిత్రాలు తీయడానికి, ధ్వనిని రికార్డు చేయడానికి ఇందులోనే ఎక్కువ కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చింది. గ్రహంపై ఉన్న రాళ్లను సేకరించే ట్యూబులు కూడా అత్యంత శుభ్రమైనవని వెల్లడించింది నాసా.