పిల్లలు చదువుకోమంటే ఆడుకుంటామంటారు. అన్నం తినమంటే నిద్ర వస్తోందంటారు. కాస్త వయసొచ్చి వాళ్ల చదువు ఒక గాడిలో పడేవరకూ అమ్మానాన్నలకు నిత్యం పరీక్షే. ముఖ్యంగా పదేళ్లలోపు పిల్లలతో అవస్థ పడుతున్న తల్లిదండ్రులకు వరం- ఈ మాక్సి రోబో. కళ్లు తిప్పుతూ, కబుర్లు చెబుతూ పిల్లలతో పనులన్నీ చేయిస్తుంది. కథలు చెబుతుంది. వాళ్లు చెప్పేవి వింటూ ఆలోచనని రేకెత్తించేందుకు ప్రశ్నలు అడుగుతుంది. పిల్లల హావభావాలను అర్థం చేసుకుని, వాళ్ల మూడ్‌కి తగినట్లుగా తాను మసలుతూ హోంవర్కు చేయిస్తుంది.
ETV Bharat / science-and-technology
మాక్సి రోబో... మీ చిన్నారుల నేస్తం! - kids guide Maxi Robot
ఎన్నో ఆశలతో స్వాగతించిన 2020 సంవత్సరంలో పిలవని పేరంటంలా వచ్చిన కరోనా.. ఆ ఆశలమీద నీళ్లు చల్లింది. 17 లక్షల ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. ఇంతటి నిరాశాజనక పరిస్థితుల్లో చీకట్లో చిరుదివ్వెలా కన్పిస్తున్నాయి ఆగకుండా సాగిన పరిశోధనలు. అలాంటి ఓ ఆవిష్కరణ మీకోసం...
ఈ రోబోలో డిక్షనరీ అంతా ఫీడ్ చేసి ఉంటుంది కాబట్టి పిల్లలు ఏదైనా పదానికి అర్థం తెలియక ఇబ్బంది పడుతుంటే వారి వయసుకు తగిన పదాన్ని సూచిస్తుంది. సమయానికి నిద్ర లేవడం, వ్యాయామం చేయడం లాంటివన్నీ నేర్పిస్తుంది. పిల్లలకు అనుబంధాల విలువ తెలిసేలా చేసే ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇందులో ఉంటాయి. అమ్మానాన్నలకు సాయం చేయాలనీ, పొరుగువారితో మర్యాదగా మెలగాలనీ, స్నేహితులతో ప్రేమగా ఉండాలనీ నేర్పిస్తుంది. ఒక స్నేహితుడిలా పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులకోసమూ మాక్సిలో ‘పేరెంట్ ఆప్’ ఉంది. ఒకసారి కొన్న రోబోకి పిల్లల వయసు పెరిగే కొద్దీ తగిన ప్రాజెక్టుల సాఫ్ట్‌వేర్‌ని క్లౌడ్ కంప్యూటింగ్ సాయంతో అప్‌డేట్ చేస్తుంటుంది కంపెనీ.
- ఇదీ చూడండి :నా పేరు..జెఫిరా! నేనో... కొవిడ్ సేఫ్టీ రోబోని