Redmi Note 11T 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. రెడ్మీ సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్మీ నోట్ 11టీ 5జీ పేరుతో వచ్చిన దీని కోనుగోళ్లను ఎంఐ వెబ్సైట్ నుంచి లేక అమెజాన్ నుంచైనా బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు, ధరలు ఇలా ఉన్నాయి.
Redmi Note 11T 5G: Price and offers
రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ మొత్తంగా మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిని ఫోన్ స్టోరేజ్ ఆధారంగా విభజించారు. వాటి ధరలు ఇలా ఉన్నాయి.
- 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999
- 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999
- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 19,999
ఈ ఫోన్‌పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే ఆఫర్ కింద వెయ్యి రూపాయిల ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.