Redmi 13C 5G Launched In India : చైనీస్ స్మార్‌ఫోన్ తయారీ కంపెనీ రెడ్మీ తాజాగా ఇండియన్ మార్కెట్లో రెడ్మీ 13సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. దీని ఫీచర్స్, స్పెక్స్ ఎలా ఉన్నాయంటే..
Redmi 13C Features :
- డిస్ప్లే- 6.74 అంగుళాల హెచ్డీ+ 90Hz డిస్ప్లే
- ప్రాసెసర్ - ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్
- ర్యామ్- 4జీబీ/ 6జీబీ/ 8జీబీ (8జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్)
- స్టోరేజ్- 128 జీబీ/ 256జీబీ (UFS 2.2 స్టోరేజ్)
- బ్యాటరీ - 5000mAh బ్యాటరీ
- ఫాస్ట్ ఛార్జింగ్ - 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- కనెక్టివిటీ- 5జీ, డ్యూయెల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.3, NFC, GPS
- ఓఎస్- ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఓఎస్
- కెమెరా - 50MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా
- ఫ్రంట్ కెమెరా - 5MP
Redmi 13C Specs : ఈ రెడ్మీ 13సీ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కానీ బాక్స్‌లో కేవలం 10వాట్ ఛార్జర్ మాత్రమే వస్తుంది. స్టోరేజీ విషయానికి వస్తే.. మైక్రో ఎస్డీ కార్డును ఇన్సర్ట్ చేయడం ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5జీ, డ్యూయెల్ సిమ్, వైఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ ఫీజర్లను కలిగి ఉంది.
ఈ రెడ్మీ ఫోన్లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పాటు Mali-G57 MC2 GPU కూడా ఉంది. కనుక దీనితో హెవీ గ్రాఫిక్స్ టాస్క్‌లు, గేమ్‌లు ఆడుకోవచ్చు. అంతేకాదు దీనిలోని ట్రిపుల్ కెమెరాతో మంచి క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.