Power Banks: దూర ప్రయాణాలు చేసేప్పుడు ఫోన్ డెడ్ కాకుండా పవర్ బ్యాంక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపరు. మరి వెయ్యి లోపలే మంచి పవర్ బ్యాంక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఓసారి చూసేయండి మరి..!
Mi Power Bank 3i:
Best Power Bank Under 1000: 10,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో షావోమీ ఎంఐ పవర్ బ్యాంక్ 3ఐ వస్తుంది. దీని ధర రూ.899. ఎంఐ.కామ్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో దొరుకుతున్నాయి. 2వే ఫాస్ట్ ఛార్జింగ్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్-సీ ఛార్జింగ్, మైక్రో-యుఎస్‌బీ పోర్ట్, లోపవర్ మోడ్ వంటి ఫీచర్స్ ఈ పవర్ బ్యాంక్‌లో ఉన్నాయి. డ్యూయల్ యుఎస్‌బీ అవుట్‌పుట్ ఇవ్వడంతో ఒకే సారి రెండు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.
Ambrane Power Bank:
10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. డ్యూయల్ యుఎస్‌బీ పోర్ట్స్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌తో నలుపు, తెలుపు రంగుల్లో విక్రయిస్తున్నారు. అమెజాన్ వెబ్ స్టోర్స్‌లో రూ.699కే ఈ పవర్ బ్యాంక్ లభ్యమవుతోంది.
Realme Power Bank 2i:
రియల్‌మీ పవర్ బ్యాంక్ 10,000ఎంఏహెచ్ సామర్థ్యంతో రూ.899కే లభిస్తోంది. రెండు యూఎస్‌బీ- A పోర్ట్స్, టైప్-సీ, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 12W 2వే క్విక్ ఛార్జ్, షార్ట్ సర్క్యూట్ వంటి వాటి నుంచి రక్షణగా 14-లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్, రియల్‌మీ.కామ్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయొచ్చు.
ZEB-MD20000G3:
₹1000 లోపలే అత్యధికంగా 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో జీబ్రానిక్స్ ZEB-MD20000G3 మోడల్ వస్తుంది. ఎల్‌ఈడీ పర్సంటేజ్ ఇండికేటర్‌తో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో రూ.949కే లభ్యమవుతోంది. 12W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో పాటు ఔట్‌పుట్ కోసం రెండు యూఎస్‌బీ-ఏ పోర్ట్స్, యూఎస్‌బీ టైప్- సీ, ఇన్‌పుట్ కోసం మైక్రో యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. ఈ పవర్‌బ్యాంక్‌కు అదనపు ఆకర్షణగా ఎల్‌ఈడీ టార్చ్‌ను కూడా అమర్చారు.