తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

'గూగుల్​ పే'తో​ ఇక అమెరికా నుంచి భారత్​కు డబ్బు! - గూగుల్ పే ఇంటర్నేషనల్​ పేమెంట్స్

గూగుల్​ పే అమెరికా యూజర్లు ఇకపై అంతర్జాతీయంగా నగదు బదిలీ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం భారత్​, సింగపూర్​ వంటి దేశాలకు నగదు బదిలీ ఫీచర్​ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 200కుపైగా దేశాలకు అమెరికా నుంచి పేమెంట్ చేసే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

Google pay International Transfer features
గూగుల్​పై ఇంటర్నేషనల్​ ట్రాన్స్​ఫర్​

By

Published : May 12, 2021, 5:33 PM IST

అమెరికా గూగుల్​ పే యూజర్లు ఇకపై భారత్​, సింగపూర్​లోని యూజర్లకు నేరుగా నగదు బదిలీ చేసుకోవచ్చని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వెస్టర్న్​ యూనియన్ ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 200లకు పైగా దేశాలకు, వైస్​ ద్వారా 80కిపైగా దేశాలకు అమెరికా నుంచి గూగుల్ పే యూజర్లు నగదు బదిలీ చేసేందుకు వీలు కల్పించనున్నట్లు తెలిపింది.

పేమెంట్ చేయాల్సిందిలా..

దేశీయ లావాదేవీలతో పోలిస్తే.. అంతర్జాతీయ పేమెంట్ కాస్త భిన్నంగా ఉండనుంది. అంతర్జాతీయంగా నగదు బదిలీ చేయాలనుకున్నప్పుడు బెనిఫీషియరీని ఎంపిక చేసుకుని.. కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. దీనితో పాటు పేమెంట్​ గేట్​వేగా వెస్టర్న్​ యూనియన్​ లేదా వైస్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

గూగుల్​పే ద్వారా జరిపే అంతర్జాతీయ లావాదేవీల సేవలను జూన్​ 16 వరకు ఉచితంగా అందించనుంది వెస్టర్న్​ యూనియన్​. లావాదేవీ విలువపై కూడా పరిమితులు లేవు. నూతన వినియోగదారులు 500 డాలర్ల వరకు ఉచితంగా ట్రాన్స్​ఫర్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వైస్ వెల్లడించింది.

ఇదీ చదవండి:కార్లకు కరోనా సెగ- ఏప్రిల్​లో విక్రయాలు డీలా!

ABOUT THE AUTHOR

...view details