తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మార్కెట్లో సందడి చేస్తోన్న స్టైలిష్‌ వైర్‌లెస్ ఛార్జర్స్​ - తెలంగాణ వార్తలు

ఛార్జర్‌ ఎక్కడుందో వెతుక్కోవడం.. ప్లగ్‌కి అడాప్టర్‌ పెట్టడం.. ఇదంతా ఒకప్పుడు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడంతా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌. ఫోన్‌ తీసి స్టాండ్‌పై పెడితే చాలు.. ఛార్జ్‌ అయిపోతుంది. కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ట్రెండీ మెుబైళ్లన్ని వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసేవే. దీంతో టెక్‌ ప్రియులను ఆకట్టుకునేందుకు మార్కెట్‌లో సందడి చేస్తున్న భిన్నమైన వైర్‌లెస్‌ ఛార్జర్లేంటో మీరూ చూసేయండి.

stylish-wireless-charger-available-markets
మార్కెట్లో సందడి చేస్తోన్న స్టైలిష్‌ వైర్‌లెస్ ఛార్జర్స్​

By

Published : Mar 14, 2021, 1:42 PM IST

మార్కెట్లో సందడి చేస్తోన్న స్టైలిష్‌ వైర్‌లెస్ ఛార్జర్స్​

అత్యవసరంగా బయటికి వెళ్లాలి. చేతిలో పవర్‌ బ్యాంక్‌ లేదు. ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టేందుకు తగిన సమయం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం.. చచ్చినట్టు ఇంట్లోనే కొంచెం సేపు ఆగి ఛార్జ్‌ చేసుకుంటాం. ఇకపై ఆ అవసరం లేదు. కేబుల్‌తో పని లేకుండా, క్షణాల్లో ఛార్జ్‌ అయ్యే వైర్‌లెస్‌ ఛార్జర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని మెుబైళ్లకే పరిమితమైన ఈ ఫీచర్... రానున్న రోజుల్లో ప్రతి ఫోన్‌కూ వచ్చే అవకాశం ఉంది.

ఒకప్పుడు మెుబైల్‌ ఛార్జ్‌ చేయాలంటే తక్కువలో తక్కువ 2 గంటలు పట్టేది. ఇప్పుడైతే దాదాపుగా 20 నిమిషాల్లో 80% బ్యాటరీ ఛార్జ్‌ అవుతోంది. అందుకోసం పలు మెుబైల్‌ కంపెనీలు ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో ఛార్జర్లు అందిస్తున్నాయి. తాజాగా షావోమి సంస్థ ప్రస్తుతం ఉన్న ఛార్జర్లకు భిన్నంగా ఎయిర్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో రిమోట్‌ ఛార్జర్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అంటే.. కేబుల్స్‌, ఛార్జింగ్‌ స్టాండ్‌ అవసరం లేదు. ఈ ఎమ్​ఐ ఛార్జర్‌ 4 సెంటీ మీటర్ల పరిధిలో వైర్‌లెస్‌ పవర్‌ అందిస్తుంది. ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ మెుబైళ్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

సౌకర్యవంతంగా...

మ్యాడ్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌.. ఐఫోన్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన స్మార్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌ ఇది. ఐఫోన్‌ 8 మోడల్‌ తరువాత అన్ని వెర్షన్స్‌కి ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌లో వీడియోలు చూడటానికి వీలుగా స్టాండ్ ఛార్జర్‌ తీర్చిదిద్దారు. ప్రయాణ సమయాల్లో సౌకర్యవంతంగా వాడుకోవచ్చు. 7.5 వాట్స్‌ సామర్థ్యంతో ఛార్జ్‌ చేసుకోవచ్చు. కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లూ ఉపయోగించేలా రూపొందించారు. పరికరం దాదాపు 7వేల రూపాయల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

ఫోన్​తో జతకట్టి..

చూస్తుంటే ఇదేదో బ్లూటూత్‌ స్పీకర్‌ బాక్సులా ఉందే అనుకుంటున్నారా? నిజమే కానీ, అంతకు మించిన సౌకర్యం కూడా ఉంది. దీనిపైన ఫోన్‌ ఉంచితే చాలు.. ఛార్జ్‌ అవుతుంది. అంతేకాదు.. ఈ పరికరం ఫోన్‌తో జతకట్టి అలారంలా పనిచేస్తోంది. ఐఓఎస్‌ 8, ఆపై మోడళ్లు ఉపయోగించేలా ఈ పరికరం రూపొందించారు.

వాతావరణం బట్టి..

హువావే సంస్థ స్టైలిష్‌ వైర్‌లెస్ ఛార్జర్‌ ప్యాడ్ ఇది. వృత్తాకారంలో ఉన్న ఈ పరికరం ఫోన్‌తో జతకట్టి వైర్‌లెస్‌ ఛార్జర్‌గా పనిచేస్తోంది. 15 వాట్స్‌ సామర్థ్యంతో ఛార్జ్‌ చేసుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. బయటి వాతావరణాన్ని బట్టి అవుట్‌ పుట్‌ పవర్‌ని నియంత్రించుకుంటుంది. ఈ పరికరం మార్కెట్లో దాదాపు 4 వేల రూపాయల నుంచి లభ్యమవుతోంది.

వైర్​లెస్ ఛార్జ్..

బయటికి వెళ్తే పవర్‌ బ్యాంకు ఉండాల్సిందే. కొన్నిసార్లు పవర్‌ బ్యాంకు పెట్టుకుంటారు గానీ కేబుల్‌ మర్చిపోతారు. అలాంటప్పుడు పవర్‌ బ్యాంకే వైర్‌లెస్‌ ఛార్జర్‌గా పనిచేస్తే బాగుంటుంది కదా! అలాంటిదే.. ఈ ఛార్జర్‌. అంబ్రేన్‌ సంస్థ రూపొందించిన ఈ పరికరం.. క్యూఐ ఛార్జింగ్‌ టెక్నాలజీతో వైర్‌లెస్‌ ఛార్జ్‌ చేస్తోంది. 10 వేల ఎంఏహెచ్ సామర్థ్యం గల ఈ పవర్‌ బ్యాంక్‌ ఫుల్‌ ఛార్జ్‌కు 8 గంటలు తీసుకుంటుంది. ఈ ప్రతికూలత అధిగమిస్తూ నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టాండ్​తో ఛార్జింగ్..

ఆఫీస్‌లో లేదా ఇంట్లో మనం కూర్చునే ప్రదేశాల్లో పెన్నులు, టీవీ రిమోట్లు పెట్టుకునే స్టాండ్‌ ఉంటుంది. పక్కనే ఛార్జర్‌ లేదా పవర్‌ బ్యాంక్‌ కచ్చితంగా ఉంటుంది. వాటన్నింటిని ఒక్కటి చేసి ఉపయోగించుకుంటే బాగుంటుంది కదూ..! ఇక్కడ కనిపించే వైర్‌లెస్‌ ఛార్జర్‌ అలాంటిదే. ఫోన్‌ని ఈ స్టాండ్‌కు పెడితే చాలు. ఛార్జ్‌ అవుతుంది. ఈ తరహా వైర్‌లెస్‌ ఛార్జర్లు మార్కెట్‌లో అనేక సంస్థలు అందిస్తున్నాయి. ఫోన్‌లు వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసుకునే రోజులు వచ్చాయి. ఇంకాస్త ముందడుగు వేసి... ఇయర్‌ ఫోన్‌లను కూడా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ చేసే ఫీచర్‌ తీసుకువచ్చింది.. పీట్రాన్‌ సంస్థ. మార్కెట్‌లోకి బాస్‌ బడ్స్‌ విస్టా ఇయర్‌బడ్స్‌ విడుదల చేసింది. 5 వాట్ల సామర్థ్యంతో వైర్‌లెస్‌ ఛార్జర్‌తో ఛార్జ్ చేయెుచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 12 గంటలు వాడుకోవచ్చు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌తో పని చేసేవంటే ఖరీదు ఎక్కువని అనుకోకండి. దాదాపు 2 వేల రూపాయల నుంచే ఇది లభిస్తుంది.

ఇదీ చూడండి:స్వయం సమృద్ధి దిశగా.. ఉద్యాన శాఖ అడుగులు

ABOUT THE AUTHOR

...view details