మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించిన సర్‌ఫేస్ డుయో చూడడానికి మామూలు స్మార్ట్‌ఫోనులానే ఉంటుంది. తెరిచినప్పుడు రెండు పక్కలా రెండు తెరలు కన్పిస్తాయి. రెండు తెరల మీదా రెండు వేర్వేరు ఆప్‌లను తెరిచి ఒకేసారి వేర్వేరు పనులు చేసుకోవచ్చు. ఒకదాని మీద మెయిల్ రాసుకుంటూ, మరో దాని మీద వాట్సాప్ చాటింగ్ చేయొచ్చు. లేదంటే రెండిటినీ కలిపి ఒకే తెరలా వాడుకోవచ్చు. అప్పుడు పెద్ద తెరమీద హాయిగా సినిమాలు చూసు కోవచ్చు.
ETV Bharat / science-and-technology
మడతపెడితే స్మార్ట్ ఫోన్.. మడత విప్పితే నోట్‌బుక్ - micro soft company innovated surface duo
అది ఫోనా..కంప్యూటరా..ఈ రెండూ అంటోంది మైక్రోసాఫ్ట్. ఈ సంస్థ తయారుచేసిన ‘సర్‌ఫేస్ డుయో’ మడతపెట్టిన స్మార్ట్ ఫోనులా కనిపిస్తుంది. మడత విప్పితే నోట్‌బుక్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది.
ఒకదాన్ని తెరగానూ రెండోదాన్ని కీబోర్డుగానూ మార్చుకుని గబగబా రాసు కోవచ్చు. కీబోర్డు కాస్త పెద్దగా ఉంటుంది కాబట్టి టైప్ చేయడం తేలిక. మరో తెర అంతా ఖాళీ కాబట్టి చదవటానికీ బాగుంటుంది. నోట్‌బుక్ కంప్యూటర్‌తో పనిచేసుకున్నట్లు ఆఫీసు పనులూ చేసేసుకోవచ్చు. పనైపోయాక మడతపెట్టి జేబులో పెట్టేసుకోవడమే. అలాగని లావుగానో బరువుగానో ఉండదు, సెంటీమీటరు మందం మాత్రమే ఉంటుంది. ఇప్పటికే కెమెరానీ టేప్‌రికార్డర్‌నీ తనలో కలిపేసుకున్న స్మార్ట్‌ఫోను భవిష్యత్తులో కంప్యూటర్‌నీ ఆక్రమించేస్తుందనడానికి నిదర్శనం ఈ ఫోను అంటున్నారు నిపుణులు.
- ఇదీ చూడండి :మెక్రోసాఫ్ట్ నుంచి రెండు తెరల మడతఫోన్!