తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Instagram New Feature: రీల్స్ చేస్తే డబ్బులు!

టీక్​టాక్​కు పోటీగా ఇన్​స్టాగ్రామ్​ తీసుకొచ్చిన రీల్స్​లో మరో అదిరే ఫీచర్​ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రీల్స్ క్రియేటర్స్​కు ప్రోత్సాహమిచ్చే విధంగా.. బోనస్​ పేరుతో ఈ ఫీచర్​ అందుబాటులోకి రానుందని టెక్ వర్గాల ద్వారా తెలిసింది. మరి ఈ కొత్త ఫీచర్​ వివరాలు ఏమిటో మీరూ చూసేయండి.

Reels Videos get Pay option soon
రీల్స్ వీడియోలకు డబ్బులు

By

Published : May 31, 2021, 6:04 AM IST

గత ఏడాది భారత్​ టిక్​టాక్​ను బ్యాన్ చేసిన తర్వాత.. ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు ఆ మార్కెట్​ను అందిపుచ్చుకునే పనిలో పడ్డాయి. ఈ రేసులో ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్​ ముందు వరుసలో ఉందని చెప్పాలి. ఇందులో భాగంగా టిక్​టాక్​లానే షార్ట్ వీడియోలను వివిధ గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్​లతో క్రియేట్​ చేసేందుకు వీలుగా.. రీల్స్ అనే ఫీచర్​ను ప్రవేశపెట్టింది ఇన్​స్టాగ్రామ్.

తాజాగా.. యూజర్లు ఇప్పుడు రీల్స్​ చేస్తూ డబ్బులు సంపాదించేందుకు వీలుగా.. 'బోనస్​' అనే ఫీచర్​ను తీసుకువచ్చేందుకు ఇన్​స్టా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలెసాండ్రో పలుజ్జీ అనే ఆండ్రాయిడ్​ డెవలపర్​ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ స్క్రీన్​షాట్​ను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ఇటీవలే గూగుల్​కు చెందిన యూట్యూబ్​ కూడా.. షార్ట్స్​ వీడియో క్రియేటర్లకు 100 మిలియన్​ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించడం గమనార్హం.

వారికి మాత్రమే ఈ ఫీచర్​?

స్క్రీన్​ షాట్​లో ఉన్న వివరాల ప్రకారం.. క్రియేటర్లు కొత్త వీడియో అప్​లోడ్​ చేస్తే.. వారికి డబ్బులు చెల్లించనుంది ఇన్​స్టా. మానిటైజేషన్​ చేసి వీడియోలను క్రియేటర్లు ఎప్పటికపక్పుడు సమీక్షించుకునే అవకాశం కూడా ఇందులో ఉండనుంది. అయితే ఎలాంటి క్రియేటర్లకు ఈ బోనస్​ ఫీచర్​ అందుబాటులో ఉంటుందని అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఎక్కువ మంది ఫాలోవర్లు, తరచు వీడియోలు చేసే వారికి మాత్రమే ఈ ఫీచర్​ అందుబాటులో ఉంటుందని టెక్ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి.

అయితే ఈ బోనస్​ ఫీచర్​ ఇంకా అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. దీనిపై ఇన్​స్టా అధికారిక ప్రకటన కూడా చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ ఫీచర్​ ఎవరికి అందుబాటులో ఉంటుంది? అనే విషయంపై కూడా క్లారీటీ వస్తుంది.

ఇదీ చదవండి:VPN: నెట్టింట సేఫ్​గా విహరించండిలా..

ABOUT THE AUTHOR

...view details