తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఇన్​స్టా సరికొత్త ఫీచర్.. రీల్స్​గా మారనున్న వీడియోలు! - ఇన్‌స్టాగ్రామ్‌

వినియోగదారులకు ఇప్పటికే ఎన్నో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్న ఇన్​స్టాగ్రామ్ మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చే పనిలో పడింది. వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చే ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

instagram new features 2022
instagram new update features

By

Published : Jul 2, 2022, 4:23 PM IST

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. ఇన్‌స్టా యూజర్లకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది మెటా సంస్థ. ఇందులో కొత్తేముంది? అంటారా.. కానీ, ఈ ఫీచర్‌ యూజర్ల వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చేస్తుందట. అవునండీ.. మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. "ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అనుభూతిని మరింత సులభతరం చేయడంతోపాటు, మెరుగుపరచాలనే ఉద్దేశంతో వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చే ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం" అని మెటా సంస్థ తెలిపింది. పబ్లిక్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేసిన వీడియోలు రీల్స్‌గా మారినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఎవరైనా సదరు రీల్స్‌లోని ఆడియో, వీడియో క్లిప్‌లను వేర్వేరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఖాతాల్లో వీడియో-రీల్స్‌ కేవలం ఖాతాను ఫాలో అవుతున్న వారికి మాత్రమే కనిపిస్తాయని తెలిపింది.

గత రెండేళ్లుగా షార్ట్‌ వీడియోలను చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో షార్ట్‌ వీడియోలను యూజర్లకు చేరువచేయాలనే ఉద్దేశంతో ఇన్‌స్టాగ్రామ్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో యూజర్లకు కొత్త ఫీచర్లు పరిచయం చేయడంలో ఇన్‌స్టాగ్రామ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వయసు ధ్రువీకరణ కోసం సెల్ఫీ వీడియో, సోషల్‌ వోచింగ్‌ ఫీచర్లను తీసుకొస్తున్న సంగతి తెలిందే. అంతకముందు యూజర్ల కోసం అవతార్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఇదీ చూడండి:వాట్సాప్​ కాల్స్​ రికార్డ్​ చేయడం ఎలాగో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details