Increase Battery Life Android Phones : ఫోన్ వాడాలంటే బ్యాటరీ ముఖ్యం. ఫోనే కాదు.. బ్యాటరీతో నడిచే ఏ డివైజ్ అయినా ఉపయోగించాలంటే దీని సామర్థ్యం తగినంత ఉండాలి. తొందరగా బ్యాటరీ డ్రైన్ అయితే చికాకు వస్తుంది. మారుతున్న కాలానికనుగుణంగా ఫోన్‌లోని అన్ని ఫీచర్లలో భారీ మార్పులు వస్తున్నాయి కానీ బ్యాటరీ విషయంలో పెద్దగా ఛేంజ్ లేదు. బ్యాటరీ పనితీరు సాఫ్ట్వేర్ లక్షణాలపై ఆధారపడే పరిస్థితి ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఈ 14 టిప్స్ పాటించి బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. అవేంటంటే?
1. పవర్ సేవింగ్ ఆన్ చేసుకోవడం
ఫోన్‌లో ఎక్కువ బ్యాటరీని ఆదా చేయడానికి పవర్-సేవింగ్ మోడ్ (బ్యాటరీ సేవర్) ఆన్ చేయడం మొదటి మార్గం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో బ్యాటరీ విభాగానికి వెళ్లి ఆన్ చేసుకోవచ్చు. సామ్సంగ్ ఫోన్లలో దీంతో పాటు దాని కింద ఉండే 5జీ టర్న్ ఆఫ్, బ్రైట్‌నెస్‌ని సాధారణం కంటే 10 శాతం తగ్గించడం, సీపీయూ స్పీడ్‌ని 70 శాతానికి పరిమితం చేసుకోవాలి. వీలుని బట్టి ఇతర సెట్టింగ్స్‌ను ఛేంజ్ చేసుకోవాలి.
2. లొకేషన్ సర్వీసు ఆఫ్ చేసుకోవడం
లొకేషన్ సర్వీసులను ఆఫ్ చేసుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్ ఆదా చేసుకోవచ్చు. దీనికి తోడు అవసరమైన యాప్స్‌కి మాత్రమే లొకేషన్ పర్మిషన్ ఇచ్చి మిగతా వాటికి అనుమతి రద్దు చేయాలి. ఇవి బ్యాగ్రౌండ్లో లొకేషన్ ఉపయోగించుకోవడం వల్ల బ్యాటరీ లైఫ్‌పై ఎఫెక్ట్ పడుతుంది. దీనికోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి లొకేషన్ > యాప్ పర్మిషన్స్‌కి వెళ్లి ఏయే యాప్‌కు పర్మిషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చు.
3. డార్క్ మోడ్‌ని ఉపయోగించడం
మీ ఫోన్ AMOLED డిస్ ప్లే ఉంటే డార్క్ మోడ్‌ను ఉపయోగించడం వల్ల బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పిక్సెల్స్, బ్యాగ్రౌండ్‌ను డిసేబుల్ చేస్తుంది. దీంతో పాటు డార్క్ వాల్ పేపర్, సిస్టంలోని డార్క్ థీమ్ వినియోగం, వాట్సాప్, యూట్యూడ్, ట్విట్టర్ (X), జీమెయిల్ లాంటి అప్లికేషన్లకు డార్క్ థీమ్ అప్లై చేసి వాడుకోవాలి. ఫలితంగా బ్యాటరీ తక్కువ వినియోగం అవుతుంది.
4. ఆటోమేటిక్ వైఫై టర్న్ ఆఫ్
ఆండ్రాయిడ్ ఓరియో వెర్షన్ రిలీజైనప్పటి నుంచి ఆటోమేటిక్ వైఫై ఆప్షన్ వచ్చింది. గతంలో మనం ఏదైనా వైఫై నెట్ వర్క్ కోసం వెతికినప్పుడు మాత్రమే వైఫ్ ఆన్ చేయాల్సి ఉండేది. కానీ తర్వాత కాలంలో ఏదైనా నెట్ వర్క్ అందుబాటులో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వైఫై ఆన్ అవుతుంది. దీన్ని ఆఫ్ చేసుకోవడానికి Settings > Connections > Wi-Fi కి వెళ్లి Advanced మెనూ సెలెక్ట్ చేసుకుని Turn on Wi-Fi automatically పై క్లిక్ చేయాలి.
5. బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్ యాప్ రిస్ట్రిక్ట్
చాలా యాప్‌లు ఉపయోగించి వదిలేసిన తర్వాత కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే అప్లికేషన్ల వల్ల బ్యాటరీ డ్రైన్ అవుతుంది. వీటిని నియంత్రించాలి. దీనికోసం Settings > Apps ఓపెన్ చేసి మీకు నచ్చిన యాప్‌ను ఎంచుకోండి. తర్వాత దాని కింద యాప్ ఇన్ఫో ఉంటుంది. అందులో Battery పై క్లిక్ చేసి బ్యాగ్రౌండ్ మేసేజ్‌ని రిస్ట్రిక్ట్ చేయవచ్చు. కొంచెం పాత మోడళ్లు వాడే వారు.. Greenify అనే థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్‌గా వాటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది.
6. స్క్రీన్ పిక్సెల్స్ తగ్గించడం
Pixoff అనే థర్డ్-పార్టీ యాప్ ద్వారా మాన్యువల్‌గా పిక్సెల్‌లను స్విచ్ ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ సేవ్ చేయవచ్చు. దీని వల్ల కొంత క్వాలిటీ కోల్పోతారు. కానీ మీరు 1080 పిక్సెల్ లేదా HD రిసొల్యూషన్లో చూసినప్పుడు మినహాయించి మిగతా వాటిల్లో పెద్దగా తేడా ఏం అనిపించదు. సామ్ సంగ్ వంటి కొన్ని కంపెనీలు డిస్ ప్లే రిసొల్యుషన్ని తగ్గించే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
7. బ్యాక్‌గ్రౌండ్ డేటా ఆక్సెస్ డిసేబుల్ చేయడం
బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా (ఇంటర్నెట్) ఉపయోగించుకునే అనవసర అప్లికేషన్లకు ఇంటర్నెట్ను డిసేబుల్ చేయాలి. యాప్స్‌కు నెట్ కనెక్షన్ లేకపోతే అవి కొత్త ఫైల్స్ డౌన్లోడ్ చేయలేవు. బ్యాగ్రౌండ్లో రన్ కాలేవు. ఫలితంగా బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది. ఇది ఆఫ్ చేయడానికి Settings > Apps కి వెళ్లి ఏదోఒక యాప్ సెలెక్ట్ చేయండి. అక్కడ Usage పై క్లిక్ చేసి Mobile data ని ఎంచుకుంటే Allow background data usage ని ఆఫ్ చేయండి.
8. అనవసర యాప్‌లు తీసేయండి
మీరు ఎక్కువగా ఉపయోగించని యాప్ ఏదైనా ఉన్నట్లయితే, దాన్ని అన్ఇన్‌స్టాల్ చేయండి. ఎప్పుడో అవసరం వచ్చిందని దాన్ని ఇన్స్టాల్ చేసుకుని తర్వాత వాడని యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని తీసేయడం వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. తీసేయడానికి వీలు లేని ఇన్ బిల్ట్‌గా వచ్చిన మరికొన్ని యాప్స్‌ను ఫోర్స్ స్టాప్ చేయడం మంచిది.