తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

నంబర్ సేవ్​ చేయకుండా వాట్సాప్​లో మెసేజ్​ చేయండిలా.. - వాట్సాప్ ఛాటింగ్

ప్రస్తుత కాలంలో వాట్సాప్‌ వాడని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న సందేశం పంపించాలన్నా.. మనం ఉపయోగించేది వాట్సాప్! మనం సేవ్ చేసుకున్న కాంటాక్టులకే కాకుండా.. కొత్త నంబర్లకూ (Whatsapp message non contact) వాట్సాప్​లో సందేశాలు పంపించవచ్చని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి...

whatsapp message without saving number
whatsapp message without saving number

By

Published : Nov 28, 2021, 3:08 PM IST

వాట్సాప్​ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్​ యాప్​లలో ఇదీ ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. అందులో చాట్​ చేయనిదే రోజు గడవదు. అంతలా మనందరి నిత్యజీవితాల్లో భాగమైపోయింది. నెట్​ బ్యాలెన్స్​ ఉంటే చాలు అపరిమితంగా మెసేజ్​లు చేసుకోవచ్చు. ఇదిలేని స్మార్ట్​ఫోన్లు ఉన్నాయంటే చాలా అరుదు. మెసేజ్ అనే పదానికి ప్రత్యామ్నాయంగా మారిపోయింది వాట్సాప్.

ఇక కొత్త నంబర్​కు సందేశం (Whatsapp tricks 2021) పంపాలంటే.. అవసరం లేకపోయినా ఆ నంబర్​ను కాంటాక్ట్​ లిస్ట్​లో యాడ్ చేయాల్సిందే. లేదంటే మేసేజ్​ చేయడానికి వీలుపడదు. అయితే వాట్సాప్​లో నంబర్ సేవ్​ చేయకుండా మెసేజ్​ పంపించవచ్చని మీకు తెలుసా? అవును. అదెలాగో మీరూ తెలుసుకోండి.

వాట్సాప్​ షార్ట్​ లింక్‌లను ఉపయోగించి బ్రౌజర్​ నుంచి చాట్‌ను చేయండిలా..

మీ ఫోన్​లోని బ్రౌజర్​ను(క్రోమ్ లేదా ఫైర్​ఫాక్స్​) ఓపెన్​ చేయండి. సెర్చ్​బార్​లో https://wa.me/0000000000 లింక్​ను కాపీ చేసి లేదా టైప్​ చేసుకోవాలి. ఇక్కడ 0000000000 స్థానంలో మన దేశం కోడ్​ 91తోపాటు మీరు మెసేజ్​ చేయాలనుకున్న ఫోన్​నంబరును టైప్​ చేయాలి. ఉదాహరణకు మీ వాట్సాప్​లో సేవ్​ కాని నంబరును https://wa.me/919911269166 ఎంటర్​ చేసి.. ఆ లింక్​ను తెరవడానికి ఎంటర్​పై క్లిక్​ చేయండి. తర్వాత మీరు రిసీపియంట్​ (గ్రహీత) మొబైల్​ నంబరుతో గ్రీన్​ కలర్​ మెసేజ్​ బటన్​తో ఒక వాట్సాప్​ పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత గ్రీన్​కలర్​ మెసేజ్​ బటన్​పై క్లిక్​ చేస్తే మీరు మొబైల్​ నంబరు సేవ్​ చేసుకోకుండా సందేశం పంపవచ్చు.

ఐఫోన్‌లో సేవ్​ చేయకుండా వాట్సాప్ నంబర్‌ను ఎలా టెక్స్ట్ చేయాలంటే?

పైన ఇచ్చిన wa.me లింకు ఐఫోన్​లోనూ పనిచేస్తుంది. దీంతో పాటు ఇతర మెరుగైన ప్రత్యామ్నాయం సైతం ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. షార్ట్​కట్స్ అనే యాప్ ద్వారా ఫోన్ నంబర్​ను సేవ్ చేయకుండానే చాటింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్​లో ఉండే 'యాక్షన్స్'​ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ నంబర్లకే కాకుండా ఇతరులకూ మెసేజ్​లు పంపించవచ్చు.

ఇదీ చదవండి:ఆ వాట్సాప్‌ల జోలికెళ్తే.. డేంజర్‌లో పడ్డట్టే!

ABOUT THE AUTHOR

...view details