How to Hide WhatsApp Call Ip Address :మనం సాధారణంగా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడాలంటే నార్మల్ సెల్యూలార్ నెట్వర్క్ ద్వారా కాల్ చేసి మాట్లాడుతుంటాం. అయితే కొందరు మాత్రం వాట్సాప్ వాయిస్ కాల్స్ కూడా చేస్తారు. ఫోన్లో నెట్వర్క్ సరిగా లేనప్పుడు లేదా కాంటాక్ట్ లిస్టులో లేని వారికి వాయిస్ కాల్స్ చేయాల్సి వచ్చినప్పుడువాట్సాప్ కాల్ ఫీచర్(Whatsapp Call) ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ విధంగా కాల్ చేయడం ద్వారా మీ IP అడ్రస్ కూడా కనిపిస్తుంది. అయితే ఆ అడ్రస్‌ను మీరు ఎక్కడా చూడలేరు. కానీ, ఈ సమాచారం మొత్తం మీరు మాట్లాడుతున్న వ్యక్తికి తెలుస్తుంది. దీంతో ఇప్పటివరకు చాలా మంది ఆ సమాచారం తెలియకుండా భాగస్వామ్య ఐపీ అడ్రస్‌లతో మాత్రమే వాయిస్ కాల్స్ లేదా వీడియో కాల్స్ చేసేవారు.
WhatsApp Call Ip Address Protect Feature :అయితే ఇకపై మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా వాట్సాప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ ఇటీవలే.. ఐపీ అడ్రస్‌ను, లొకేషన్‌ను ప్రొటెక్ట్ చేసే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ సదుపాయంతో ఆడియో, వీడియో కాల్స్(Video Call) సమయంలో మీ లొకేషన్, ఐపీ అడ్రస్ వివరాలు అవతలి వారికి తెలీకుండా చేయొచ్చు. ఇంతకీ వాట్సాప్‌లో ఆ ఫీచర్‌ను ఎలా సెట్ చేసుకోవాలి? అది ఎలా పనిచేస్తుంది? ఈ ఫీచర్ ఆన్‌లో ఉంటే కాల్స్ క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వాట్సాప్ కాల్స్‌లో IP అడ్రస్ ఎలా ఆఫ్ చేయాలంటే..
- ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. ముందుగా మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేయాలి.
- అప్పుడు రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న త్రీడాట్స్ పై క్లిక్ చేసి 'Settings' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత 'Privacy' ఆప్షన్‌పై నొక్కాలి. అనంతరం కిందికి స్క్రోల్ చేసి 'Advanced' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు కనిపించే ‘Protect IP Address in Calls’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే మీ ఫోన్లో ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
- మీరు ఒకవేళ వద్దనుకుంటే ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయొచ్చు.
వాట్సాప్‌లో మేజిక్ వాయిస్ మెసేజ్ ఫీచర్- ఒక్కసారి వినగానే మాయం- ఇలా పంపాలి!
ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..మీ ఫోన్లో ఈ ఫీచర్ ఆన్ చేస్తే.. మీరు ఎవరికి ఆడియో కాల్ చేసినా లేదా వీడియో కాల్ చేసినా ఆ సర్వర్ లోని డేటా మాత్రమే చేరుతుంది. కానీ, ఐపీ అడ్రస్ ఇకపై అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ ప్రైవసీ మెయింటెయిన్ అవుతుందని కంపెనీ ప్రకటించింది.