తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ ఆధార్​ కార్డ్​పై దొంగ సిమ్​లు ఉన్నాయా? తెలుసుకోండిలా..

Fake ID Sim Card: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక ఆధార్​ కార్డ్​పై గరిష్ఠంగా 9 సిమ్​కార్డులను తీసుకోవచ్చు. అయితే చాలా మంది వారి స్మార్ట్​ఫోన్​ లో ఉండే అవకాశం మేరకు రెండింటిని మాత్రమే వినియోగిస్తుంటారు. కానీ కొంతమందికి తెలియకుండానే వారి ఆధార్​ కార్డ్​పై వేరొకరు సిమ్​ తీసుకుని ఉపయోగిస్తుంటారు. అలాంటివి దేశ భద్రతకే ప్రమాదం అని భావించిన కేంద్రం వాటికి చెక్​ పెట్టేందుకు ఓ వెబ్​సైట్​ను తీసుకువచ్చింది.

SIM cards, Aadhaar card
సిమ్​ కార్డులు

By

Published : Dec 6, 2021, 1:24 PM IST

Fake ID Sim Card: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మానవుడు సాధారణ ఫోన్​ నుంచి స్మార్ట్​ఫోన్​ వరకు వచ్చాడు. ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి.. ఒక్క స్మార్ట్​ఫోన్​లోనే రెండు సిమ్​లను ఉపయోగించడం మొదలు పెట్టాడు. అదేమిటంటే పర్సనల్​ ఒకటి.. ఆఫిషియల్​ మరొకటి అని అంటున్నాడు. ఇలా రెండు సిమ్​కార్డ్​లు ఉండడం చాలా స్మార్ట్​ఫోన్​లలో సహజమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు సిమ్​ తీసుకోవాలి అంటే.. ప్రస్తుతం ఆధార్​ అథెంటికేషన్​ చేయాల్సి ఉంటుంది. గతంలో అయితే ఈ సౌకర్యం ఉండేది కాదు. కేవలం ఆధార్​ కార్డు సమర్పిస్తే సరిపోయేది. దీంతో మీ ప్రమేయం లేకుండానే జీరాక్స్​తో సిమ్​ కార్డు తీసుకునే ఆవకాశం ఉండేది. ఇలా మీకు తెలియకుండా మీ ఆధార్​ కార్డ్​ మీద ఎన్ని సిమ్​కార్డులు ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్​ విభాగం ఓ వెబ్​ సైట్​ను ఇటీవలే లాంచ్​ చేసింది.

ఈ పోర్టల్​ ద్వారా సదరు వ్యక్తి తన ఆధార్​ కార్డుపై ఎన్ని మొబైల్​ నంబర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయో.. తెలుసుకోవడమే గాక వినియోగంలో లేని వాటిని కూడా గుర్తించవచ్చు. వాటిని గాని ఆ వ్యక్తి ఉపయోగించకపోతే వెంటనే వాటిని టెలి కమ్యూనికేషన్​ విభాగానికి రిపోర్ట్​ చేసే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇలా రిపోర్ట్​ చేసిన ఫిర్యాదును టెలికాం అనలిటిక్స్​ ఫర్​ ఫ్రాడ్​ మేనేజ్​మెంట్​ అండ్​ కన్​స్యూమర్​ ప్రొటెక్షన్​ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికమ్యూనికేషన్​ విభాగం ఆదేశాల ప్రకారం ఓ వ్యక్తి ఆధార్​ కార్డ్​ పైన గరిష్ఠంగా 9 సిమ్​కార్డులు తీసుకోవడానికి వీలుంటుంది.

How To Find Fake Sim Cards:

మీ ఆధార్​ కార్డుపై ఎన్ని సిమ్​కార్డులు ఉన్నాయో చెక్​ చేసుకోవడానికి ఈ సింపుల్​ స్టెప్స్​ ఫాలో అవ్వండి.

  • ముందుగా టెలికాం అనలిటిక్స్​ ఫర్​ ఫ్రాడ్​ మేనేజ్​మెంట్​ అండ్​ కన్​స్యూమర్​ ప్రొటెక్షన్ వెబ్​సైట్​ (https://tafcop.dgtelecom.gov.in/) ను ఓపెన్​ చేయాలి. అందులో మీకు కింద ఇచ్చిన విధంగా కనిపిస్తుంది.
    మొబైల్​ నంబర్​ ఎంటర్​ చేయండి
  • ఎంటర్​ మొబైల్​ నంబర్ అనే దానిపై క్లిక్​ చేసి మీ మొబైల్​ నంబర్​ను అందులో ఎంటర్​ చేయాలి. తరువాత అక్కడ ఉన్న రిక్వెస్ట్​ ఓటీపీ మీద క్లిక్​ చేయాలి.
  • వచ్చిన ఓటీపీని దానిలో ఎంటర్​ చేయాలి.
    ఓటీపీ ని ఎంటర్​ చేసి లాగిన్​ అవ్వండి
  • ఓటీపీ ఎంటర్​ చేస్తే మీరు సైట్​ లోకి లాగ్​ ఇన్​ అవుతారు. తరువాత మీ ఆధార్​ కార్డ్​పై లింక్​ అయ్యి ఎన్ని మొబైల్​ నంబర్లు ఉన్నాయో సైట్​లో చూపిస్తుంది.
  • దానికి కింద పేర్కొన్న విధంగా మీరు తెలియకుండా ఉపయోగించే మొబైల్​ నెంబర్​ పక్కన ఉన్న చెక్​ బాక్స్​పై క్లిక్​ చేసి దిస్​ ఈజ్​ నాట్​ మై నంబర్​ పై క్లిక్​ చేయాలి.
    ఆధార్​ కార్డ్​పై వినియోగంలో ఉన్న సిమ్​ కార్డ్​లు
  • అనంతరం ఎంచుకున్న మొబైల్​ నంబర్​ను రిపోర్ట్​ చేస్తే.. మీ దరఖాస్తును పరిశీలించి టెలికమ్యునికేషన్​ విభాగం నిర్ణయం తీసుకుంటుంది.

ఇవీ చూడండి:

shortage of silicon wafers: సిలికాన్‌ వేఫర్ల కొరత.. టాటా చిప్‌ తయారీకి ఆటంకాలు

సీక్రెట్ ఫొటోలు, వీడియోలు దాచేందుకు గూగుల్​ కొత్త ఫీచర్

ABOUT THE AUTHOR

...view details