Google Will Delete Inactive Accounts :మీరు మీ జీ-మెయిల్ అకౌంట్‌ను చాలా కాలంగా ఉపయోగించట్లేదా? అయితే త్వరపడండి. గూగుల్ మరికొద్ది రోజుల్లో ఇన్‌యాక్టివ్ జీ-మెయిల్ అకౌంట్లను తొలగించనుంది. ఇదే జరిగితే మీ జీ-మెయిల్, గూగుల్ డ్రైవ్, డాక్స్ సహా పలు గూగుల్ ప్రొడక్టుల్లోని మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
WHY IS GOOGLE DELETING INACTIVE ACCOUNTS :జీ-మెయిల్ అకౌంట్ల భద్రతను మెరుగుపర్చేందుకు.. దాదాపు రెండేళ్లుగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను తొలగించనున్నామని గూగుల్ సంస్థ మే నెలలో ప్రకటించింది. సాధారణంగా ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో టు-ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఉండదు. అందువల్ల ఇవి హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు సైబర్ నేరగాళ్లు.. సాధారణ యూజర్ల ఖాతాలను చట్ట వ్యతిరేక, అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశముంది. అంతే కాదు యూజర్ల ఐడెంటిటీని కూడా దొంగిలించే ప్రమాదం ఉంటుంది. అందుకే సదరు ఖాతాలను డిసెంబర్ నుంచి తొలగించనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.
జీ-మెయిల్ అకౌంట్ డిలీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- కనీసం రెండు సంవత్సరాలకు ఒక సారైనా మీ జీ-మెయిల్ అకౌంట్లోకి సైన్ఇన్ కావాలి.
- మీ జీ-మెయిల్ ఖాతా ఉపయోగించి ఇతరులకు మెయిల్లు పంపుతూ ఉండాలి.
- మీ జీ-మెయిల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి గూగుల్ సెర్చింజన్‌ను ఉపయోగించాలి.
- యూట్యూబ్ వీడియోలు చూడాలి.
- గూగుల్ ఫొటోస్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తుండాలి.
- మీ గూగుల్ అకౌంట్‌తో.. థర్డ్ పార్టీ యాప్‌ల్లో లాగిన్ అయినా.. సబ్స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకున్నా.. సదరు అకౌంట్లు కూడా డిలీట్ కావు.