తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

భూకంపాలను గుర్తించే ఫోన్​లు వచ్చేస్తున్నాయ్​! - షియోమి ఫోన్లతో భూకంపం గుర్తించడం

కాలం మారుతున్న కొద్ది సాంకేతికత పరుగులు పెడుతుంది. ఒకప్పుడు డబ్బా ఫోన్​ నుంచి మొదలై.. స్మార్ట్​ఫోన్​ల వరకు వచ్చింది. ఇప్పటికే ఈ స్మార్ట్​ ఫోన్​ల సాయంతో ఎన్నో విషయాలు ముందస్తుగా తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి అవే స్మార్ట్​ఫోన్​ల సాయంతో భూకంప సమాచారాన్ని ముందుస్తుగా తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది షియోమీ(Xiaomi Phones). ఇందుకు సంబంధిచిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదివేయండి.

earthquake alert on xiaomi phone
భూకంపాలను గుర్తించే ఫోన్లు

By

Published : Sep 19, 2021, 5:01 PM IST

భూకంపాలను గుర్తించే స్మార్ట్​ ఫోన్లు త్వరలో మార్కెట్​లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం వాతావరణం, పిడుగులు పడే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి లాంటి సమాచారాన్ని ముందస్తుగానే అందించిన స్మార్ట్​ఫోన్లు.. ఇకపై భూకంపాలను గుర్తించి, వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇటువంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ (Xiaomi Phones). 'మెథడ్​ అండ్​ ఎక్విప్​మెంట్​ ఫర్​ రియలైజింగ్​ సెసిమిక్​ మానిటరింగ్​ ఆఫ్​ మొబైల్​ డివైజెస్​' పేరుతో గిజ్మోచైనా ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిలో భూకంపాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంట్​ హక్కులను పొందినట్లు పేర్కొంది. ఈ టెక్నాలజీని కొత్తగా వచ్చే స్మార్ట్​ఫోన్​ల​తో అందుబాటులోకి తీసుకురావాలి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించింది.

ఈ టెక్నాలజీ కేవలం మన దగ్గర ఉన్న స్మార్ట్​ఫోన్​లో ఉండే పరికరాల సాయంతోనే అభివృద్ధి చేయనున్నారు. ఈ పరికరాల సాయంతో సెసిమిక్​ యాక్టవిటీని ముందస్తుగా గుర్తించి యూజర్​ను సమాచారాన్ని అందిస్తుందని షియోమీ (Earthquake Alert On Xiaomi Phone) తెలిపింది. ఇది పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని వస్తే.. ప్రాణ నష్టాన్ని తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ సాంకేతికత సాయంతో ఈ ఏడాది మే లో సుమారు 4.0, అంతకంటే ఎక్కువ భూకంప తీవ్రత ఉన్న 35 భూకంపాలను గుర్తించారు. అయితే ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న 'ఎంఐయూఐ' సిస్టమ్స్​లో అందుబాటులోకి తీసుకురావచ్చని తెలుస్తోంది.

ఇదీ చూడండి:Realme C25Y: 50 మెగాపిక్సల్ కెమెరాతో రియల్‌మీ కొత్త ఫోన్

ABOUT THE AUTHOR

...view details