తెలంగాణ

telangana

By

Published : Sep 1, 2022, 9:57 AM IST

ETV Bharat / science-and-technology

వాట్సాప్ కాల్స్​కు కొత్త రూల్స్! ఇక ఫ్రీగా మాట్లాడడం కష్టమేనా?

ఇంటర్నెట్‌ కాలింగ్‌ విషయంలో టెలికాం ప్రొవైడర్లకు వర్తించే నియమాలే కమ్యూనికేషన్‌ యాప్స్‌నకూ వర్తింపజేయాలని టెలికాం సంస్థలు ఎప్పట్నుంచో ప్రభుత్వానికి కోరుతున్నాయి. తమ లాగే లైసెన్స్‌ ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడీ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది.

DoT seeks Trais view to regulate internet calling
DoT seeks Trais view to regulate internet calling

DoT seeks Trais view to regulate internet calling : వాట్సాప్‌, సిగ్నల్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌తో చేసే ఇంటర్నెట్‌ కాలింగ్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీటిని నియంత్రించే విషయంలో నిబంధనలను రూపొందించేందుకు అభిప్రాయాన్ని వెల్లడించాలని టెలికాం నియంత్రణ సంస్థ ని టెలికాం విభాగం అభిప్రాయం కోరింది. ఈ మేరకు గతంలో ట్రాయ్‌ ఇంటర్నెట్‌ టెలిఫోనీ పేరిట 2008లో ట్రాయ్‌ చేసిన సిఫార్సులను డాట్‌ వెనక్కి పంపింది. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సమగ్రమైన సిఫార్సులతో ముందుకు రావాలని ట్రాయ్‌కి సూచించినట్లు ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

ఇంటర్నెట్‌ కాలింగ్‌ విషయంలో టెలికాం ప్రొవైడర్లకు వర్తించే నియమాలే కమ్యూనికేషన్‌ యాప్స్‌నకూ వర్తింపజేయాలని టెలికాం సంస్థలు ఎప్పట్నుంచో ప్రభుత్వానికి కోరుతున్నాయి. తమ లాగే లైసెన్స్‌ ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా 2016-17 సంవత్సరంలో నెట్‌ న్యూట్రాలిటీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన వేళ టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్‌ కాలింగ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయినా ప్రభుత్వం ఆయా యాప్స్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

గతంలో ఇదే విషయంపై ట్రాయ్‌ కొన్ని సిఫార్సులు చేసింది. ఆయా యాప్స్‌ ఇంటర్‌ యూసేజ్‌ ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. అయితే, ఆ సిఫార్సులను డాట్‌ పక్కనపెట్టింది. అనంతర కాలంలో ఈ ఛార్జీల భారం నుంచి టెలికాం కంపెనీలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పుడు మళ్లీ డాట్‌ దృష్టి పెట్టడం ఆసక్తిగా మారింది. సాంకేతిక దుర్వినియోగం అవుతోందన్న కారణంతోనే డాట్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రాయ్‌ నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ఏం చేయబోతోందన్నది ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి:బ్రౌజర్​లోని చెత్తను తుడిచేయండిలా..!

వచ్చేస్తోంది 5జీ శకం, ప్రపంచాన్నే మార్చేసే సాంకేతికత

ABOUT THE AUTHOR

...view details