కొత్తగా మార్కెట్లో ఎన్ని ఫోన్లు విడుదలైనా ఐఫోన్‌కు ఉండే డిమాండ్ వేరు. చేతిలో ఇమిడిపోయే డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ధర ఎక్కువగా ఉండటంతో ఈ ఫోన్లు సామాన్యుడికి అందని ద్రాక్షేనని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌తో పోలిస్తే ఐఓఎస్‌ను అర్థం చేసుకుని ఉపయోగించడం కొంచెం కష్టమైన వ్యవహారం. ఎక్కువ మంది యూజర్స్ ఐఫోన్లపై ఆసక్తి చూపించకపోవడానికి ఇదో కారణం. ఇప్పటికీ ఐఫోన్లు ఉపయోగించేవారిలో చాలా మందికి వాటిలోని ఫీచర్ల గురించి పూర్తిగా తెలియదనే చెప్పాలి. అలాంటి ఒక ఆసక్తికర ఫీచర్ గురించి మీకిప్పుడు చెప్పబోతున్నాం. ఐఫోన్ 8 ఆపై మోడల్స్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఐఫోన్‌లో మీరు దీన్ని షార్ట్‌కట్‌గా ఉపయోగించవచ్చు. అదే బ్యాక్ ట్యాప్ (Back Tap). మరి ఈ బ్యాక్ ట్యాప్‌ని ఎలా ఎనేబుల్ చేయాలి? దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ETV Bharat / science-and-technology
ఐఫోన్లలో యాపిల్ లోగోతో ఏమేం చేయొచ్చంటే? - యాపిల్ ఐఫోన్‌లో బ్యాక్ ట్యాప్ ఫీచర్
ఐఫోన్లు ఉపయోగించేవారిలో చాలా మందికి వాటిలోని ఫీచర్ల గురించి పూర్తిగా తెలియదనే చెప్పొచ్చు. అలాంటి ఓ ఫీచర్ బ్యాక్ ట్యాప్(Back tap in iPhone). ఐఫోన్‌లో దీన్ని షార్ట్‌కట్‌గా ఉపయోగించవచ్చు. మరి ఈ బ్యాక్ ట్యాప్‌ని ఎలా ఎనేబుల్ చేయాలి?
ఐఫోన్ వెనకవైపు యాపిల్ లోగో ఉంటుంది. దానిపై మీరు టచ్ చేసి ఐఫోన్‌లోని ఏదైనా ఫీచర్‌కి షార్ట్‌కట్‌లా ఉపయోగించవచ్చు. అయితే ఈ ఫీచర్ ఐఫోన్ 8 నుంచి ఆపై మోడల్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఐఓఎస్ 14లో ఈ బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను(back tap in iPhone) పరిచయం చేశారు. యాక్సిలరోమీటర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసేందుకు ముందుగా ఐఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
- అందులో యాక్ససబిలిటీ ఓపెన్ చేసి టచ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కిందకు స్క్రోల్ చేస్తే బ్యాక్ ట్యాప్ అని కనిపిస్తుంది.
- దాన్ని ఓపెన్ చేస్తే అందులో మీకు డబుల్ ట్యాప్ (రెండుసార్లు టచ్ చేయడం) లేదా ట్రిపుల్ ట్యాప్ (మూడుసార్లు టచ్ చేయడం) ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఒక ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీరు బ్యాక్ ట్యాప్‌కి అసిస్టివ్ టచ్, సిరి షార్ట్‌కట్స్, మ్యాగ్నిఫయర్, రీచబిలిటీ, వాయిస్ ఓవర్, స్క్రీన్‌షాట్స్, లాక్‌స్క్రీన్, నోటిఫికేషన్ సెంటర్, క్యూఆర్‌కోడ్ స్కానింగ్ వంటి వాటితోపాటు మీకు నచ్చిన ఫీచర్స్‌ని కూడా షార్ట్‌కట్‌గా పెట్టుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు యాపిల్ లోగోపై డబుల్ లేదా ట్రిపుల్ ట్యాప్ చేస్తే సదరు షార్ట్‌కట్ పనిచేస్తుంది.
ఇదీ చూడండి:ఆ యాప్‌పై సైబర్ దాడి- హ్యాకర్ల చేతికి 70 లక్షల మంది వివరాలు!