చెట్లకి జంతువుల్లాగే ఆనందం, ఆవేదనా వంటి అనుభూతులుంటాయని మన భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ కనిపెట్టారని చదువుకుని ఉంటాం! చెట్లలో అతి స్వల్పంగా విడుదలయ్యే విద్యుత్తు ప్రకంపనల్ని నమోదుచేసే ‘క్రిస్కోగ్రాఫ్’ అనే పరికరాన్ని కనిపెట్టారాయన. ఆ ప్రకంపనల హెచ్చుతగ్గుల్ని అంచనావేయడం ద్వారానే వాటికీ అను భూతులుంటాయని ప్రపంచానికి చాటారు. ఆ పరిశోధనని మరింతగా ముందుకు నడిపించారు క్లీవ్ బ్యాక్‌స్టర్ అనే అమెరికా శాస్త్రవేత్త. చెట్లకి కేవలం అనుభూతులే కాదు... తమకి హానిచేసినవాళ్లని గుర్తించే శక్తి కూడా ఉందని ఆయన నిరూపించారు.
ETV Bharat / science-and-technology
అలా చేస్తే మొక్కలు భయంతో వణికిపోతాయి..! - science and technology
చెట్లకి.. జంతువుల్లాగే ఆనందం, ఆవేదనా వంటి అనుభూతులుంటాయని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ కనిపెట్టారని మనం చదువుకుని ఉంటాం!. ఆ పరిశోధనని మరింతగా ముందుకు నడిపించారు క్లీవ్ బ్యాక్‌స్టర్ అనే అమెరికా శాస్త్రవేత్త. చెట్లకు కేవలం అనుభూతులే కాదు... తమకి హానిచేసినవాళ్లని గుర్తించే శక్తి కూడా ఉందని ఆయన నిరూపించారు.
ఇందుకోసం ‘పాలిగ్రాఫ్ గాల్వనోమీటర్’(పాలీజీ) అనే పరికరాన్ని వాడారు. ఓ రోజు తన గదిలో రెండు మొక్కల్ని పెట్టి వాటికి ఈ పాలీజీని అనుసంధా నించారు. ఆ గది నుంచి బయటకొచ్చి తన అనుచరులు ఆరుగుర్ని పిలిచి ‘మీలో ఒకరు ఆ రెండు మొక్కల్లో ఒకదాన్ని మీ కాలితో తొక్కి రావాలి. మిగతావాళ్లు గదిలోకి జస్ట్ అలా వెళ్లి వచ్చేయాలి. మొక్కల్ని ఎవరు తొక్కారో నాకు చెప్ప కూడదు... ఆ విషయం మొక్కలే నాకు చెబుతాయి!’ అన్నారట. వాళ్లు అలాగే చేసి బయటకొచ్చారు. ఆ తర్వాత బ్యాక్‌స్టర్ గదిలోకి వెళ్లి బయట ఉన్న వాళ్లని ఒక్కొక్కర్నీ లోపలికి పిలవడం మొదలుపెట్టాడు. ఐదుగురు లోపలికి వచ్చినప్పుడు ‘పాలీజీ’లో ఏ మార్పూ కనిపించలేదు. కానీ, ఓ వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు మాత్రం పాలీజీ గ్రాఫ్ అత్యధికంగా పెరిగిందట! ‘నువ్వేనా మొక్కని తొక్కింది!’ అని అడిగితే అవునని చెప్పాడట ఆ అనుచరుడు! దీన్ని బట్టి తనని హింసించిన వ్యక్తుల్ని చెట్లు మనుషులంత స్పష్టంగానే గుర్తుపెట్టుకోగలవనీ, వాళ్లని చూసి భయంతో వణికిపోతాయనీ ప్రపంచానికి చాటారు బ్యాక్‌స్టర్!
ఇదీ చదవండి:కోర్టు ఆదేశించినా.. నిందితుడిని వదిలేసిన పోలీసులు