తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2022, 10:29 PM IST

ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్​ యూజర్లకు గుడ్​న్యూస్​.. ఇకపై మొబైల్​ నెట్​వర్క్​ లేకున్నా​..

Android 14 Satellite : ఆండ్రాయిడ్​లో సరికొత్త సాంకేతికతను పరిచయం చేయనుంది గూగుల్​. త్వరలో మొబైల్​ నెట్​వర్క్​ అందుబాటులో లేకున్నా.. ఫోన్​ కాల్స్​, మెసేజ్​లు చేసుకోవచ్చు. ఎలానో చూద్దామా?

Android 14 to bring direct satellite connectivity to smartphones
Android 14 to bring direct satellite connectivity to smartphones

Android 14 Satellite : మొబైల్స్‌కు శాటిలైట్‌ కనెక్టివిటీ.. గత కొన్ని రోజులుగా టెక్‌ ప్రపంచంలో దీని గురించే చర్చ నడుస్తోంది. ఐఫోన్ 14 మోడల్స్‌లో ఈ సాంకేతికత ఉంటుందని వార్తలు వచ్చినప్పటి నుంచీ టెక్‌ వరల్డ్‌లో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్‌లోనూ ఇలాంటి సాంకేతికత ఉంటుంది అని గూగుల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దీంతో త్వరలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హిరోషీ లొషెమెర్‌ ట్వీట్ చేశారు.

''రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నాం. దీని కోసం మా భాగస్వాముల నుంచి సహకారం తీసుకుంటున్నాం.''

- ట్వీట్‌లో హిరోషీ లొషెమెర్‌

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. దాని బీటా వెర్షన్‌లో శాటిలైట్‌ కనెక్టివిటీ లాంటి ఆప్షన్లు కనిపించలేదు. అంతేకాదు త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాబట్టి 13లో ఈ కీలక మార్పు ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ 14లోనే ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

2023లో స్పేస్‌ఎక్స్‌
ప్రపంవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ కూడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో టీ-మొబైల్‌, స్పేస్‌ఎక్స్‌ కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటన చేశాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌ లేని ప్రాంతాలకు స్టార్‌లింక్‌ శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించాయి. 2023లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు కూడా తెలిపాయి. ఇప్పటికే స్టార్‌లింక్‌ శాటిలైట్‌ కనెక్టివిటీతో విదేశాల్లో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. భారత్‌లోనూ ఈ తరహా సేవలను ప్రారంభించాలని భావించినా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

ఇవీ చూడండి:సరికొత్త ఫీచర్స్​తో నయా స్మార్ట్​ఫోన్స్​, సెప్టెంబర్​లో రిలీజయ్యేవి ఇవే

వాట్సాప్​లో ఈ ట్రిక్స్ అన్నీ​ మీకు తెలుసా? ఇప్పుడు మరింత మెరుగ్గా..

ABOUT THE AUTHOR

...view details