మనలో చాలామందికి కాల్షియం లోపం ఉంటుంది! ఇది ఉన్న వారిలో ఎముకల బలహీనంగా ఉంటాయి. అటువంటి వారిలో కీళ్ల నొప్పులు ఎక్కువగా బయటపడుతుంటాయి. వీటికి చెక్ పెట్టాలి అంటే కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. అయితే ఇది ఎక్కువగా ఉండే రెసిపీనే 'క్యాల్షియం స్మూతీ'. దాని తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
క్యాల్షియం స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు..
- వాల్నట్స్
- దానిమ్మ రసం
- సోయా మిల్క్
- యాపిల్
- తేనే
తయారీ విధానం
- ముందుగా బ్లెండర్ జార్‌ను తీసుకోవాలి. వాల్‌నట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అందులో వేసుకోవాలి.
- యాపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన ఉన్న తొక్కను తీసేయాలి.
- ముందుగా తీసుకొన్న దానిమ్మ రసాన్ని వాటితో పాటే జార్లో వేయాలి.
- సోయా మిల్క్‌ను కూడా ఆ మిశ్రమంతో జత చేయాలి.
- తగినంత తేనెను అందులో వేసుకోవాలి. తేనె లేని పక్షంలో చక్కెర లేదా బెల్లం వేసుకోవచ్చు.
- ఇలా తీసుకొన్న దానిని జ్యూస్‌లా చిక్కగా చేసుకోవాలి. దీంతో క్యాల్షియం స్మూతీ రెడీ అవుతుంది.
ఉపయోగాలు
- ఇది ఆస్ట్రో పొరోసిస్కు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- యాపిల్‌లో ఫైబర్ ఉంటుంది. దానితో పాటు మన శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్ ఉంటాయి.
- మోనోపాజ్ స్టార్ట్ అయిన మహిళలు దీనిని తీసుకోవడం మంచిది.
- వాల్‌నట్స్‌తో బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది. పిల్లలు, పెద్దలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా 40, 50 ఏళ్లు దాటిన వారిలో ఉండే కీళ్ల నొప్పుల తగ్గేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
- వ్యాయామం చేసిన 15 నుంచి 20 నిమిషాల లోపు తీసుకుంటే ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:నైట్ డ్యూటీ చేసే వాళ్లు.. పగలు వయాగ్రా వేసుకోవచ్చా?