'పాస్తా'.. ఇటలీ ఆహారశైలిలో ఒకటి. అయితేనేమి ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల ప్రజలు ఈ వంటకాన్ని తింటారు. ఎన్నో రూపాల్లో.. విభిన్నమైన రుచుల్లో.. దొరికే పాస్తాను ఒక్కసారి తింటే మళ్లీ వదిలిపెట్టరు. అటువంటి పాస్తా మన దేశంలోనూ వివిధ రుచులతో సందడి చేస్తోంది. ప్రస్తుతం సీ ఫుడ్ పాస్తా(seafood pasta recipe)కు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో(seafood pasta recipe make simple) చూద్దాం.
కావాల్సిన పదార్థాలు (తగిన మోతాదులో తీసుకోండి)
వెన్న(బటర్), ఉల్లిపాయ ముక్కలు, పుట్టగొడుగులు, వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్, మైదా పిండి -1 స్పూన్, చికెన్ స్టాక్ (చికెన్ ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్లు), ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, రొయ్యలు, ఛీజ్, నిమ్మరసం, పాస్తా.