Sankranti 2024 Non Veg Special Recipe :సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెటూళ్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా తెలుగు ప్రజలంతా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా.. అంటూ సరదాగా ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకుంటారు. ఈ పండగలో భాగంగా ఇంటిముందు అందమైన రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలుంటాయి. ముఖ్యంగా ఇంటికొచ్చిన బంధుమిత్రులతో ఇల్లంతా పండగ శోభను సంతరించుకుంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. మరోవైపు ఘుమఘుమలాడే పిండి వంటలు, రకరకాల నాన్ వెజ్ వంటకాలు ఈ పండక్కి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి..
ఇక చాలా మంది నాన్‌వెజ్‌లో సంక్రాంతి(Sankranti 2024)కి నాటుకోళ్లు వండుకొని తినడానికి ఆసక్తి చూపిస్తారు. నిజానికి దీని రుచే వేరు. కూర, వేపుడు, పలావ్, బిర్యానీ ఏది చేసినా ఆ టేస్టే అదిరిపోతుంది. అలా తింటుంటే ఇలా నోట్లోకి వెళ్తూనే ఉంటుంది. అయితే ప్రతిసారిలా కాకుండా ఈ సారి నాటుకోడి పులుసు ఇలా ట్రై చేయండి.. అందరు ఆహా అనడమే కాదు.. ఒక్క ముక్క కూడా మిగలకుండా దంచి పడేస్తారు. చెప్తూంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా.. మరింకెందుకు ఆలస్యం.. నాటుకోడి పులుసు ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నాటుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు :
- నాటుకోడి మాంసం - అర కేజీ
- తరిగిన ఉల్లిపాయలు- 2
- పచ్చిమిర్చి-6
- టమాటాలు - రెండు(చిన్నవి)
- నూనె- తగినంత
- బిర్యానీ ఆకులు- 4
- కారం - రుచికి సరిపడినంత
- పసుపు - కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్-1 పెద్ద స్పూన్
- ఉప్పు-సరిపడా
- పెరుగు-కొద్దిగా
- కరివేపాకు-కొద్దిగా
- కొత్తిమీర-1 కట్ట(తురుముకోవాలి.)
ముందుగా మీరు అర కేజీ నాటుకోడి మాంసం సిద్ధం చేసుకొని ఉండాలి. అంటే నాటు కోడిని కోసి దాన్ని క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ముందుగానే మసాలా పొడి, పేస్ట్‌ను రెడీ చేసుకుని ఉండాలి.
మసాలా పొడి తయారు చేసుకునే విధానం..అనాస పువ్వు-1, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఒకటి, ఎండుమిర్చి - 3, లవంగాలు-6, యాలకులు - 4, వెల్లుల్లి రెబ్బలు-8, కొద్దిగా జాజికాయ పొడి, ఒక స్పూన్ ధనియాలు.. తీసుకుని ఒక పాత్రలో దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకొని మసాలా పొడి సిద్ధం చేసి పక్కకు పెట్టుకోవాలి.