తెలంగాణ

telangana

ETV Bharat / priya

కొర్రల ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా? - కొర్రల ఉప్మా

కొర్రలు కడుపు నింపడమే కాదు.. బరువును అదుపులో ఉంచుతాయని వైద్యులు చెబుతుంటారు. అందుకే, ఆరోగ్యం వైపు పరుగులు పెడుతున్నవారు కొర్రలను (Korrala upma recipe) నిత్యావసర వస్తువుగా ఇంట్లోకి తెచ్చేసుకుంటున్నారు. కానీ, కొర్రలను ఎప్పుడూ ఒకే రకంగా ఉడికించి తింటే బోరే కదా..! అందుకే, వారానికోసారి ఇలా కొర్రల ఉప్మా (Korrala upma preparation) చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.

Korrala upma recipe
కొర్రల ఉప్మా వంటకం

By

Published : Oct 8, 2021, 6:59 AM IST

కొర్రలను ఎప్పుడూ ఒకే రకంగా (tasty millet upma) ఉడికించి తింటే బోరే కదా..! ఆరోగ్యాన్నిచ్చే కొర్రలను రుచికరంగా (Korrala upma recipe) మార్చుకోవాలంటే.. కొర్రల ఉప్మాను​ ఓ సారి ట్రై చేయాల్సిందే..

కొర్రల ఉప్మా

కావల్సిన పదార్థాలు:

  • కొర్రలు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, అల్లం, ఎండు మిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బీన్స్ ముక్కలు, క్యారెట్​ ముక్కలు.

తయారీ విధానం:

కొర్రలను ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. (Korrala upma recipe) ఇప్పుడు కడాయిలో నూనె బాగా వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, అల్లం, ఎండు మిరపకాయలు తర్వాత పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బీన్స్ ముక్కలు, క్యారెట్​ ముక్కలు జోడించి కాసేపు వేగనివ్వాలి. ఒక కప్పు నీళ్లుపోసి మరిగిన తరువాత అందులో ముందుగా డ్రైరోస్ట్ చేసి పెట్టుకున్న కొర్రలు ఆ మిశ్రమానికి కలపాలి. ఆ మిశ్రమాన్ని 10-15 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకుంటే కొర్రల ఉప్మా రెడీ అవుతుంది.

ఇదీ చదవండి:'బ్రెడ్‌ ఉప్మా' ఓసారి ట్రై చేయాల్సిందే సుమా!

ABOUT THE AUTHOR

...view details