ఆరోగ్యాన్నిచ్చే కొర్రలను రుచికరంగా మార్చుకోవాలంటే.. కొర్రల సలాడ్‌ను ఓ సారి ట్రై చేయాల్సిందే...
హెల్దీ 'కొర్రల సలాడ్' సింపుల్ రెసిపీ! కావాల్సినవి
- కొర్రలు - కప్పు (అరగంట నానబెట్టి తర్వాత అన్నంలా వండుకోవాలి),
- సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్, కీరదోస, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున,
- ఉల్లికాడల తరుగు - కప్పు,
- కొత్తిమీర తరుగు - అలంకరణ కోసం.
డ్రెసింగ్ కోసం
- నిమ్మరసం - టేబుల్‌స్పూను,
- ఆలివ్‌నూనె - మూడు టేబుల్ స్పూన్లు,
- ఉప్పు, మిరియాలపొడి - రుచికి సరిపడా.
తయారీ విధానం
ముందుగా డ్రెసింగ్ కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న కొర్రలపై డ్రెసింగ్, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. చివరగా టేబుల్‌స్పూను డ్రెసింగ్, కొత్తిమీర తరుగు వేస్తే చాలు. కావాలనుకుంటే ఇందులో ఉడికించిన క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బటానీల్లాంటివి వేసుకోవచ్చు.
ఇదీ చదవండి: చిరుజల్లుల వేళ 'జపనీస్ ఆనియన్ సూప్' చేసుకోండిలా!